Asianet News TeluguAsianet News Telugu

మైన‌ర్ బాలిక‌పై యువ‌కుడి అత్యాచారం.. ఘ‌ట‌నను రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్.. త‌రువాత ఏం జ‌రిగిందంటే ?

మైనర్ పై ఓ యువకుడి లైంగిక దాడికి పాల్పడి ఆ ఘటనను వీడియో తీశాడు. ఇటీవల దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

The rape of a minor girl by a young man.. the incident was recorded and posted on social media.. what happened next?
Author
First Published Sep 25, 2022, 3:13 PM IST

మహిళలపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఎదో ఒక చోట లైంగిక‌ వేధింపుల ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. ఆడవాళ్లు క‌నిపిస్తే చాలా మగాళ్ల‌లో ఉన్న మృగాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. వావి వర‌స‌లు మ‌రిచి కామంతో కాటేస్తున్నారు. మహిళ శారీర‌క, మాన‌సిక‌ ప‌రిస్థితి కూడా ఆలోచించ‌డం లేదు. వికలాంగుల‌పై కూడా లైంగిక‌దాడుల‌కు దిగుతున్నారు. చిన్న పిల్ల‌లు, మైనర్లు అని కూడా చూడకుండా వారిపైకి అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘ‌ట‌న‌ను ఆ యువ‌కుడు వీడియో కూడా తీశాడు. అనంత‌రం ఆ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘ‌ట‌న జ‌న‌వ‌రిలో జ‌ర‌గగా.. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

గంజాయి తోట గుర్తించి పరిశీలించిన పోలీసు.. అధికారిపై దాడి చేసిన 40 మంది గంజాయి సాగుదారులు

దీనికి సంబంధించి  భోపా పోలీస్ స్టేషన్ ఆఫీస‌ర్ బ్రిజేంద్ర సింగ్ రావత్ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఓ 15 ఏళ్ల బాలిక‌తో కోచింగ్ సెంట‌ర్ లో 21 ఏళ్ల యువ‌కుడికి స్నేహం ఏర్ప‌డింది. దీంతో  ఆ యువ‌కుడు ఆమె స్నేహాన్ని ఆస‌రాగా తీసుకొని అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీనిని అత‌డు వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఈ ఘ‌ట‌న జ‌న‌వ‌రిలో చోటు చేసుకుంది. కానీ ఈ విష‌యాన్ని బాధితురాలు త‌న త‌ల్లిదండ్రుల‌కు వెల్ల‌డించ‌లేదు. 

కానీ గ‌త శ‌నివారం నిందితుడు ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ విషయం బాధితురాలు త‌ల్లిదండ్రుల‌కు తెలిసింది. వారు వెంట‌నే వెళ్లి పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌మ కూతురుపై జ‌రిగిన అఘాయిత్యాన్ని పోలీసుల‌కు వెల్ల‌డించారు. ఆ యువ‌కుడిపై ఫిర్యాదు చేశారు. త‌ల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు ద‌ర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు. నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ (పోక్సో) చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. 

చంఢీగ‌డ్ విమానాశ్ర‌యానికి భ‌గ‌త్ సింగ్ పేరు పెడుతాం - ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

ఇలాంటి ఘ‌ట‌న ఇటీవ‌ల మ‌హారాష్ట్రలోని బారామ‌తిలో వెలుగులోకి వ‌చ్చింది. ఓ మానసిక విక‌లాంగ మైన‌ర్ బాలిక‌పై ఏడాదికి పైగా అత్యాచారం జ‌ర‌ప‌డంతో బాధితురాలు గ‌ర్భం దాల్చింది. పూణె జిల్లాలోని ఇందాపూర్ తాలూకా వాల్‌చంద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ 13 ఏళ్ల బాలిక‌పై ఓ వ్యక్తి పలుమార్లు లైంగికంగా దాడి చేశాడు. 6వ తరగతి చదువుతున్న బాధితురాలిపై నవంబర్ 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు అనేక అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు.

ఎనిమిది దేశాల్లో తెలంగాణ జాగృతి బతుకమ్మ పండుగ వేడుకలు

బాధితురాలు గర్భవతి అని వైద్య పరీక్షల్లో తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ మహిళ తో పాటు మ‌రో ఇద్ద‌రు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుభాంగి అమోల్ కుచేకర్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios