Telugu News Live: నేటి ముఖ్యాంశాలివే...

Telugu News Live Updates

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీ పరిణమాలు, క్రీడ, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం.. 

9:22 PM IST

పటాన్ చెరులో కోడి పందాలు.. పరారీలో చింతమనేని ప్రభాకర్

హైదరాబాద్ పటాన్ చెరులోని కోడి పందాలు జరుగుతున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
8:39 PM IST

రాజ్యసభకు పీటీ ఉషా, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్

పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డేలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. 
 
7:49 PM IST

నారాయణరెడ్డి పరువు హత్యకేసులో ఇద్దరి అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డి పరువు హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా మరో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. పటాన్ చెరులో నారాయణ రెడ్డిని దారుణంగా హతమార్చారు నిందితులు. నెల్లూరులో శ్రీనివాస్ రెడ్డి, కాశీలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

7:11 PM IST

తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ ఫీజు గ‌డువు పొడిగింపు

తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువును పొడిగించారు. ఈ మేరకు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు ప్ర‌క‌టన చేశారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చ‌ని తెలిపారు. ఇక, ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వ‌హించ‌నున్నారు.

6:08 PM IST

వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు  అది ముగిశాక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై చివరి మాసంలో అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత  క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు  సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా,  మహ్మద్ షమీ, రిషభ్ పంత్ లకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. ఈ సిరీస్ లో భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. 

6:07 PM IST

త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్.. మంత్రి హరీష్ రావు

తెలంగాణలో పలు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే గ్రూప్-4 నోటిఫికేషన్‌కు సంబంధించి తెలంగాణ ఆర్థిక శాఖ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో సమావేశమైన హరీష్ రావు ఈ కామెంట్ చేశారు. ఇక, గ్రూప్‌ 4లో 9,168 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. 

5:02 PM IST

కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మోదీ కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ రోజు చివరిసారిగా మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. నఖ్వీ రాజ్యసభ పదవీకాలం రేపటితో ముగియనుంది. అయితే ఇటీవలి రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి ఆయనకు అవకాశం కల్పించలేదు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ నఖ్వీ రాజీనామా చేయడంతో.. ఆయన ఎన్డీఏ తరఫున బరిలో నిలుస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

4:19 PM IST

గద్వాలలో కలుషిత నీరు తాగి 20 మందికి అస్వస్థత.. ఇద్దరు మృతి

జోగులాంబ గద్వా జిల్లా కేంద్రంలో కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను కృష్ణ, నర్సింగమ్మగా గుర్తించారు. వీరు కలుషిత నీరు తాగడం వల్లే చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్దారించారు. 

3:32 PM IST

మలేషియా మాస్టర్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించిన పీవీ సింధు

మలేషియా మాస్టర్స్‌లో భారత స్టార్ ప్లేయర్​ పీవీ సింధు శుభారంభం చేశారు. మలేషియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రౌండ్​లో చైనాకు చెందిన He Bing Jiaoపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. జియావొ​పై సింధు 21-13 17-21 21-15 తేడాతో విజయం సాధించారు.

2:53 PM IST

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ లాయర్‌‌కు బెదిరింపులు

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ లాయర్‌ హస్తిమల్ సరస్వత్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. అతని చాంబర్ వెలుపల ఆ లేఖ కనిపించింది. “శత్రువు మిత్రుడే మన శత్రువు. మేము ఎవరినీ వదిలిపెట్టం. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టము. త్వరలో మీకు మూసేవాలా కు పట్టిన గతే పడుతుంది” అని లేఖలో రాసి ఉంది. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ లేఖ వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. 

2:16 PM IST

స్పైస్ జెట్ సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు

స్పైస్ జెట్ సంస్థకు DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్పైస్ జెట్ విమానాల్లో చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలపై వివరణ కోరింది. ఇక, గత 18 రోజుల్లో స్పైస్ జెట్ విమానాల్లో 8 సాంకేతిక లోపం ఘటనలు చోటుచేసుకున్నాయి. 

1:24 PM IST

తెనాలిలో కారు బీభత్సం.. ముగ్గురికి తీవ్ర గాయాలు..

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగంతో దూసుకొచ్చిన కారు టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు నుజ్జు కాగా, మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

12:18 PM IST

తెలంగాణ భవన్‌లో బోనాల సందడి.. అమ్మవారికి బోనం సమర్పించిన కిషన్ రెడ్డి

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బోనం సమర్పించారు. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. ఇక, ఢిల్లీలో ఏడేళ్లుగా బోనాల ఉత్సవాలను సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ నిర్వహిస్తుంది.  
 
11:20 AM IST

తాడిపత్రిలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆర్టీసీ డ్రైవర్ రామయ్య.. డిపోలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకునేందుకు యత్నించాడు. అయితే తోటి కార్మికులు అతడిని అడ్డుకున్నారు. డీఎం నరేంద్ర రెడ్డి, యూనియన్ నాయకులు వేధిస్తున్నారని ఆరోపించాడు. 

10:25 AM IST

దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 16,159 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య దాదాపు మూడు వేలు అధికంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212గా ఉంది. తాజాగా కరోనాతో 28 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,25,270కి చేరుకుంది. ఇక దేశంలో మంగళవారం 9,95,810 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,982,086,763కి చేరింది. 

9:28 AM IST

తెలంగాణలో నేడు, రేపు అతి భారీ వర్షాలు

తెలంగాణ నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొద్ది రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

9:25 AM IST

ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత.. మధ్యాహ్నం అంత్యక్రియలు

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్థ రాత్రి తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రాజు దాదాపు 800 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్తానంలో గౌతమ్‌ రాజు అంత్యక్రియలు జరగనున్నాయి. 
 
9:13 AM IST

మరోసారి పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర..

గృహావసరాలు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండ్ ధర మరోసారి పెరిగింది. సిలిండర్ ధర రూ. 50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 1,053కి చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ. 1,055గా ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1,105కు పెరిగింది.

9:22 PM IST:

హైదరాబాద్ పటాన్ చెరులోని కోడి పందాలు జరుగుతున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 
8:39 PM IST:

పరుగుల రాణి పీటీ ఉష, సంగీత దర్శకుడు ఇళయ రాజా, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌, కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డేలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. రాష్ట్రపతి కోటాలో వీరిని రాజ్యసభకు నామినేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభకు నామినేట్ అయిన వీరిని ప్రధాని నరేంద్ర మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. 
 
7:49 PM IST:

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నారాయణ రెడ్డి పరువు హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా మరో ఇద్దరు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. పటాన్ చెరులో నారాయణ రెడ్డిని దారుణంగా హతమార్చారు నిందితులు. నెల్లూరులో శ్రీనివాస్ రెడ్డి, కాశీలను పోలీసులు అదుపులోకి తీసుకుని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

7:11 PM IST:

తెలంగాణ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువును పొడిగించారు. ఈ మేరకు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు ప్ర‌క‌టన చేశారు. ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు ఆయా కాలేజీల్లో ఫీజు చెల్లించొచ్చ‌ని తెలిపారు. ఇక, ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వ‌హించ‌నున్నారు.

6:08 PM IST:

ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు  అది ముగిశాక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. జులై చివరి మాసంలో అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత  క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు  సీనియర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా,  మహ్మద్ షమీ, రిషభ్ పంత్ లకు విశ్రాంతినిచ్చారు సెలక్టర్లు. ఈ సిరీస్ లో భారత జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. 

6:07 PM IST:

తెలంగాణలో పలు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే గ్రూప్-4 నోటిఫికేషన్‌కు సంబంధించి తెలంగాణ ఆర్థిక శాఖ హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలో టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో సమావేశమైన హరీష్ రావు ఈ కామెంట్ చేశారు. ఇక, గ్రూప్‌ 4లో 9,168 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. 

5:06 PM IST:

కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మోదీ కేబినెట్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ రోజు చివరిసారిగా మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. నఖ్వీ రాజ్యసభ పదవీకాలం రేపటితో ముగియనుంది. అయితే ఇటీవలి రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి ఆయనకు అవకాశం కల్పించలేదు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ నఖ్వీ రాజీనామా చేయడంతో.. ఆయన ఎన్డీఏ తరఫున బరిలో నిలుస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

4:19 PM IST:

జోగులాంబ గద్వా జిల్లా కేంద్రంలో కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతిచెందారు. మృతులను కృష్ణ, నర్సింగమ్మగా గుర్తించారు. వీరు కలుషిత నీరు తాగడం వల్లే చనిపోయినట్టుగా డాక్టర్లు నిర్దారించారు. 

3:32 PM IST:

మలేషియా మాస్టర్స్‌లో భారత స్టార్ ప్లేయర్​ పీవీ సింధు శుభారంభం చేశారు. మలేషియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రౌండ్​లో చైనాకు చెందిన He Bing Jiaoపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. జియావొ​పై సింధు 21-13 17-21 21-15 తేడాతో విజయం సాధించారు.

2:53 PM IST:

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ లాయర్‌ హస్తిమల్ సరస్వత్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. అతని చాంబర్ వెలుపల ఆ లేఖ కనిపించింది. “శత్రువు మిత్రుడే మన శత్రువు. మేము ఎవరినీ వదిలిపెట్టం. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టము. త్వరలో మీకు మూసేవాలా కు పట్టిన గతే పడుతుంది” అని లేఖలో రాసి ఉంది. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఈ లేఖ వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు. 

3:02 PM IST:

స్పైస్ జెట్ సంస్థకు DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్పైస్ జెట్ విమానాల్లో చోటుచేసుకుంటున్న సాంకేతిక లోపాలపై వివరణ కోరింది. ఇక, గత 18 రోజుల్లో స్పైస్ జెట్ విమానాల్లో 8 సాంకేతిక లోపం ఘటనలు చోటుచేసుకున్నాయి. 

1:24 PM IST:

ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగంతో దూసుకొచ్చిన కారు టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ రోడ్డు పక్కన రిక్షాలు మరమ్మతులు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరి కాలు నుజ్జు నుజ్జు కాగా, మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

3:04 PM IST:

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బోనం సమర్పించారు. వచ్చే ఏడాది నుంచి ఢిల్లీలో జరిగే బోనాల ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించనున్నట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. ఇక, ఢిల్లీలో ఏడేళ్లుగా బోనాల ఉత్సవాలను సింహవాహిని మహంకాళి ఆలయ కమిటీ నిర్వహిస్తుంది.  
 
11:20 AM IST:

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆర్టీసీ డ్రైవర్ రామయ్య.. డిపోలోనే ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకునేందుకు యత్నించాడు. అయితే తోటి కార్మికులు అతడిని అడ్డుకున్నారు. డీఎం నరేంద్ర రెడ్డి, యూనియన్ నాయకులు వేధిస్తున్నారని ఆరోపించాడు. 

12:28 PM IST:

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 16,159 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య దాదాపు మూడు వేలు అధికంగా ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212గా ఉంది. తాజాగా కరోనాతో 28 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,25,270కి చేరుకుంది. ఇక దేశంలో మంగళవారం 9,95,810 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,982,086,763కి చేరింది. 

9:28 AM IST:

తెలంగాణ నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొద్ది రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 

9:25 AM IST:

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్థ రాత్రి తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రాజు దాదాపు 800 సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశారు. మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్తానంలో గౌతమ్‌ రాజు అంత్యక్రియలు జరగనున్నాయి. 
 
9:13 AM IST: