కారణమిదే: గుర్రంపై ఆఫీసుకెళ్ళిన టెక్కీ

Techie rides a horse to office on last day of work
Highlights

వినూత్న నిరసన

బెంగుళూరు: బెంగుళూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులపై ఓ టెక్కీ వినూత్నంగా నిరసన తెలిపారు. ట్రాఫిక్ రద్దీతో పాటు సాఫ్ట్‌వేర్ రంగంలో చోటు చేసుకొంటున్న శ్రమదోపిడిని నిరసిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. లాస్ట్ వర్కింగ్ డే రోజున గుర్రంపై కార్యాలయానికి వచ్చి ట్రాఫిక్ పై తన నిరసనను వ్యక్తం చేశాడు.


రూపేశ్‌కుమార్ శర్మ  సాప్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. బెంగుళూరు నగరంలోని ఓ పేరున్న బహుళజాతి సంస్థలో పనిచేస్తున్నాడు.ప్రతి రోజూ రూపేశ్ శర్మ తన కార్యాలయానికి రావాలంటే  ట్రాఫిక్ లో నరకయాతన పడుతున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయడంతో వేలాది రూపాయాలను జీతంగా తీసుకొంటున్నాడు. 

అయితే సాఫ్ట్ వేర్ రంగంలో శ్రమ దోపిడి ఎక్కువగా ఉందని రూపేశ్ శర్మ భావిస్తున్నాడు.  ఈ రెండు కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. చివరి పని దినం రోజున బెంగుళూరులో ఉన్న ట్రాఫిక్ రద్దీని  చాటి చెప్పేందుకు గాను గుర్రంపై తాను పనిచేసే కార్యాలయానికి వచ్చాడు. భవిష్యత్తులో ఎప్పుడూ కూడ బహుళజాతి సంస్థలో పనిచేయనని ఆయన చెప్పారు. 

 బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు నానాటికీ పెరిగిపోతున్నాయని, పరాష్కార మార్గాలను వెదకడంలో వెనుకబడ్డామని ఆవేదన చెందుతోన్న రూపేశ్‌.. తానీ పనిచేసింది సెన్సెషన్‌ కోసం కాదన్నారు. అయినాసరే పాపులర్‌ అయిపోవడంతో థ్రిల్‌ అయ్యానని చెప్పాడు.


 అతి త్వరలోనే సొంత కంపెనీని ప్రారంభించబోతున్నట్లు తెలిపాడు. తద్వారా దేశంలో నెలకొన్ని సమస్యలు కొన్నింటికైనా పరిష్కారాలు చూపగలననే దీమా వ్యక్తంచేశాడు. అన్ని రంగాల్లో యూనియన్లు ఉన్నా కానీ, సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసే వారికి యూనియన్లు లేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

loader