Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడు ఎన్నికలు: స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు

డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ అల్లుడి ఇంటిలో  ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి నాలుగు రోజుల ముందు  ఈ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

Tax Raids On DMK's MK Stalin's Son-In-Law, 4 Places In Chennai Searched lns
Author
Tamil Nadu, First Published Apr 2, 2021, 12:37 PM IST

డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ అల్లుడి ఇంటిలో  ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి నాలుగు రోజుల ముందు  ఈ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది.

శుక్రవారం నాడు ఉదయం 8 గంటల నుండి సోదాలు సాగుతున్నాయి.  చెన్నైలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైకి సమీపంలోని నీలగిరిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకొన్న  డీఎంకె నేతలు  నీలగిరిలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న ఇంటి వద్దకు చేరుకొన్నారు.

సేబరీశన్, కార్తీక్, బాల ఇళ్లలో కూడ సోదాలు నిర్వహిస్తున్నారు.అన్నానగర్  డీఎంకె అభ్యర్ధి కొడుకు కార్తీక్.స్టాలిన్ కొడుకు ఉధయనిధి కోయంబత్తూరులో ర్యాలీ నిర్వహించిన మరునాడే ఈ సోదాలు సాగుతున్నాయి.ఈ ఏడాది మార్చిలో డీఎంకె నేత ఈవీ వేలు ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఎంకె నేత ఈశఈ వేలు నివాసంతో పాటు పది చోట్ల సోదాలు నిర్వహించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios