చెన్నై:  ఓ ఐజీ స్థాయి అధికారి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళా ఎస్పీ  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.  పలు దఫాలు తనను కౌగిలించుకొనేందుకు ఆ అధికారి ప్రయత్నాలు చేశాడని బాధితురాలు ఆరోపించింది. మరోవైపు తన ముందే   పోర్న్ వీడియోలు చూసేవాడని బాధితురాలు ఆరోపించారు.

తమిళనాడుకు  చెందిన మహిళాఎస్పీ  ఐజీపై చేసిన  ఫిర్యాదు ప్రస్తుతం  కలకలం రేపుతోంది.  ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు.

తనకు లొంగకపోతే పనితీరుపై  ప్రతి ఏటా ఉన్నతాధికారులకు ఇచ్చే వార్షిక నివేదికలో  తనకు వ్యతిరేకంగా రిపోర్ట్ చేస్తానని బెదిరించినట్టు ఎస్పీ  ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  పలు దఫాలు తనను కౌగిలించుకొనేందుకు ప్రయత్నించాడని బాధితురాలు తెలిపారు.  తనను నిత్యం వేధింపులకు గురిచేసేవాడని చెప్పారు.

తన ముందు అశ్లీల చిత్రాలను కూడ చూస్తూ ..తనను కూడ బలవంతం చేసేవాడని మహిళా ఎస్పీ ఉన్నతాదికారులకు  ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. బాధిత ఎస్పీ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై  అంతర్గత విచారణను ప్రారంభించారు.

ఈ రకమైన కేసులను పరిష్కరించేందుకుగాను రాష్ట్రస్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విచారణ జరపనుంది. అయితే ఈ తరహా ఘటనలపై రాష్ట్రస్థాయి దర్యాప్తు కమిటీ విచారణలో ప్రాథమికంగా నేరం రుజువైతే ఆ ఉన్నతాధికారిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ వార్తలు చదవండి

ట్విస్ట్: కోర్కె తీర్చలేదని భార్యపై దాడి, పోలీసులకు షాకిచ్చిన భార్య

భర్తకు నిద్రమాత్రలిచ్చి ప్రియుడితో ఎంజాయ్: భార్యకు షాకిచ్చిన మొగుడు

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు

వరుసకు కొడుకుతో అఫైర్: వద్దన్న భర్తను చంపిన భార్య

రైలు బోగీల్లోనే శృంగారం, పట్టించుకోని అధికారులు

ప్రియురాలికి ట్విస్టిచ్చిన ప్రియుడు: లవర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ప్రియురాలు