బాలికపై 7 నెలలు 17 మంది రేప్: కోర్టులో నిందితులపై లాయర్ల దాడి

Tamil Nadu lawyers thrash 17 rape accused on court premises
Highlights

మత్తు మందు ఇచ్చి వినికిడి లోపం వల్ల 11 బాలికపై 7 నెలలు అత్యాచారం చేసిన కేసులో నిందితులపై న్యాయవాదులు దాడి చేశారు. నిందితులందరినీ మంగళవారం పోలీసులు మహిళా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడుఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

చెన్నై: మత్తు మందు ఇచ్చి వినికిడి లోపం వల్ల 11 బాలికపై 7 నెలలు అత్యాచారం చేసిన కేసులో నిందితులపై న్యాయవాదులు దాడి చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో బాలికపై 17 మంది అత్యాచారం చేసిన సంఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  

వారిని మంగళవారం పోలీసులు కోర్టుకు తీసుకుని వచ్చారు.  న్యాయవాదులు మూకుమ్మడిగా నిందితులపై దాడి చేశారు. నిందితుల తరఫున న్యాయవాది ఎవరూ వాదించరని న్యాయవాదుల సంఘం తేల్చి చెప్పింది. 

నిందితులందరినీ మంగళవారం పోలీసులు మహిళా కోర్టులో ప్రవేశపెట్టినప్పుడుఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు నిందితులను కోర్టు నుంచి బయటకు తీసుకొస్తుండగా అక్కడ ఉన్న దాదాపు 50 మంది న్యాయవాదులు వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. 

దీంతో నిందితులను రెండు గదుల్లో ఉంచి పోలీసులు రక్షణ కల్పించారు. లాయర్లకు భయపడి దాదాపు 5 గంటలు వారంతా ఆ గదుల్లోనే ఉన్నారు. రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో లాయర్లు శాంతించడంతో నిందితులను కస్టడీకి తరలించారు. కోర్టు నిందితులకు జూలై 31 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. 


చెన్నైలోని అయణవరం ప్రాంతంలో ఉన్న ఓ అపార్టుమెంటులో బాలిక నివసిస్తోంది. అదే అపార్టుమెంటులో పనిచేస్తున్న లిఫ్ట్‌ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌ సహా పలువురు నిర్వహణ సిబ్బంది బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. 

ఏడవ తరగతి చదువుతున్న ఈ బాలికపై అత్యాచారం చేసే ముందు నిందితులు ఆమెకు మత్తు ఇంజెక్షన్లు ఇవ్వడం, మత్తు పదార్థాలు కలిపిన శీతల పానీయాలను తాగించడం, పొడి రూపంలో ఉన్న మాదక ద్రవ్యాలను ముక్కుతో పీల్చేలా చేసేవారని వెల్లడించారు. బాలికపై దారుణానికి పాల్పడుతూ వీడియోలు కూడా తీశారన్నారు.

సంఘటనపై బాలిక తండ్రి ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 మంది తనపై అత్యాచారం చేశారని అమ్మాయి చెప్పిందని, వారికి సహకరించిన మరో ఆరుగురిని కూడా కలిపి మొత్తం 17 మందిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణించి విచారణ చేస్తున్నామని చెప్పారు.

ఇదిలావుంటే, నిందితులకు ఉరిశిక్ష వేయాలని చెన్నైలో ఆందోళనలు జరుగుతున్నాయి.

loader