ముంబై: 10 రోజుల విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత  సస్పెన్షన్ కు గురైన  పోలీస్ అధికారి సచిన్ వాజే తో కన్పించిన మహిళను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. థానే వ్యాపారవేత్త హిరాన్ హత్య కేసును విచారించే సమయంలో సీసీటీవీ పుటేజీలో సచిన్ వాజే వెనుక ఓ మహిళను ఎన్ఐఏ గుర్తించింది.

ఈ మహిళ కోసం  ఎన్ఐఏ పది రోజులుగా గాలించి ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. గురువారం నాడు ముంబై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకొన్నారు.పశ్చిమ థానే జిల్లాలోని శివారులో ఆమె ఇంటిని గుర్తించారు. మార్చి 25 నుండి ఈ మహిళ విషయాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఫైవ్ స్టార్ హోటల్ సీసీటీవీ పుటేజీలో ఈ మహిళను గుర్తించారు. సచిన్ వాజే ఉపయోగించిన రెండు మెర్సిడెజ్ బెంజ్ కార్లలో ఒక దాన్ని ఎన్ఐఏ సీజ్ చేసింది.