Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య కేసు: రివ్యూ పిటిషన్లు కొట్టివేసిన సుప్రీం

అయోధ్యపై దాఖలైన  18 రివ్యూ పిటిషన్లను గురువారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.
 

Supreme Court dismisses all the review petitions in Ayodhya case judgment.
Author
New Delhi, First Published Dec 12, 2019, 4:27 PM IST

అయోధ్యపై దాఖలైన  18 రివ్యూ పిటిషన్లను గురువారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసింది.

అయోధ్య వివాదానికి సంబంధించి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఐదు ఎకరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈ ఏడాది నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

అయోధ్య వివాదంపై ఈ ఏడాది నవంబర్ 9వ తేదీన ఇచ్చిన తీర్పే ఫైనల్ అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.ఈ పిటిషన్లపై పిటిషనర్ల వాదనలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే విన్నారు. అయోధ్య వివాదంపై గత తీర్పుే ఫైనల్ అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును సమీక్షిస్తూ సుప్రీంకోర్టులో 18 పిటిషన్లు దాఖలయ్యాయి.  ఈ పిటిషన్లపై గురువారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకొంది. 1993లో ప్రభుత్వం సేకరించిన స్థలంలో అయినా సున్నీ బోర్డుకు స్థలాన్ని ఇవ్వొచ్చని కూడ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో  వెల్లడించింది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు.అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ నిర్వహించాలని కూడ సుప్రీంకోర్టు తెలియజేసింది.

మూడు నెలల్లోపుగా కేంద్రం  అయోధ్య ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కూడ సుప్రీం కోర్టు ఆదేశించింది.గతంలో అలహాబాద్ కోర్టు ముగ్గురు సమానంగా వివాదస్థలాన్ని పంచుకోవాలని తీర్పు ఇచ్చింది.అయితే ఈ తీర్పును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios