నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Sunday 30th October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

10:05 PM IST

రాహుల్ పాదయాత్రలో అపశృతి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పేపరస్ పోర్ట్ రిసార్ట్స్ సమీపంలో జోడో యాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతుండగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 125 కేవీ, 62 జనరేటర్లు, రెండు డీసీఎం వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

8:58 PM IST

టీమిండియాపై దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. భారత్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 19.4 ఓవర్లలో ఛేదించారు. మిల్లర్ 59, అయిడెన్ మార్ క్రమ్ 52 పరుగులు చేశారు. 

8:06 PM IST

కేబుల్ బ్రిడ్జి ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

7:40 PM IST

శ్రీవారి సేవా టికెట్ల పేరుతో మోసం

తిరుమల శ్రీవారి సేవా టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుపథం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇతను కాణిపాకం దేవస్థానంలో గ్యాస్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

6:26 PM IST

సౌతాఫ్రికా లక్ష్యం 134 పరుగులు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ ఎదుట దక్షిణాఫ్రికా 134 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ 68 పరుగులు చేశాడు. ఎంగిడి 4, వ్యాన్ పార్నెల్ 3, నోకియా ఒక పరుగు చేశాడు. 

5:45 PM IST

టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం

టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. 49 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. సూర్యక్రమార్ 8, దినేశ్ కార్తీక్ 1 పరుగుతో క్రీజులో వున్నారు

4:48 PM IST

ముగిసిన జనసేన పీఏసీ సమావేశం

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఆదివారం మంగళగిరిలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలకు ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు జనసేన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటన చేసింది.  

4:07 PM IST

టీ20 ప్రపంచకప్‌లో పాక్ తొలి విజయం

టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు పాకిస్తాన్ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పెర్త్‌లో నెదర్లాండ్స్‌ నిర్దేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 13.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రిజ్వాన్ 49, ఫఖార్ జమాన్ 20, షాన్ మసూద్ 12 పరుగులు చేశాడు

2:50 PM IST

మక్తల్ టీఆర్ఎస్‌లో విభేదాలు

వనపర్తి జిల్లా మక్తల్ టీఆర్ఎస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే చిట్టెం, టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయులను అడ్డుకున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆత్మకూరులో కురుమూర్తిస్వామి ఆభరణాల ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకుంది. 

1:49 PM IST

టీ20 వరల్డ్ కప్ నుండి పాక్ ఇంటికే..: బిసిసిఐ చీఫ్ బిన్నీ

పాకిస్తాన్ టీం ఇక టీ20 వరల్డ్ కప్ నుండి వైదొలగనుందని... సేమీస్ కు చేరే అవకాశాలు చాలా తక్కువని బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డారు. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు పసికూన జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోవడంపై స్పందిస్తూ బిన్ని ఈ వ్యాఖ్యలు చేసారు. 

12:42 PM IST

తెలంగాణలో సిబిఐకి నో ఎంట్రీ ... కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కు అనుమతిస్తూ ఇచ్చిన జీవో 51 ను కేసీఆర్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారక ఆదేశాలిచ్చింది. 
 
11:33 AM IST

సోమాలియాలో కార్ బాంబ్ పేలుడు... 100 మంది మృతి

సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుళ్లలో 100 మంది చనిపోయినట్లు ఆ దేశాధ్యక్షుడు హసన్ షేక్ మహమూద్ తెలిపారు. కారులో బాంబ్ అమర్చి పేలుడుకు పాల్పడినట్లు అధ్యక్షుడు తెలిపారు. 

9:56 AM IST

ఏపీకి ఆరంజ్ అలర్ట్ ... మరో రెండ్రోజులు భారీ వర్షాలు

ఈశాన్య రుతుపవనాలు ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయని... వీటి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 1, 2 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

9:56 AM IST

గుంటూరులో ఉద్రిక్తత... చర్చిలోనే ఇద్దరు ఫాస్టర్ వర్గాల ఘర్షణ

గుంటూరు పట్టణంలో ఇద్దరు చర్చ్ ఫాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో ప్రార్థన చేసే అధికారం తమదంటే తమదేనని పరదేశి బాబు, శ్యామ్ సంపత్ వర్గాల పాస్టర్లు గొడవపడ్డారు. ఇరువర్గాలు చర్చికి చేరుకుని పరస్పరం కుర్చీలు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్చి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 

10:05 PM IST:

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పేపరస్ పోర్ట్ రిసార్ట్స్ సమీపంలో జోడో యాత్ర కోసం ఏర్పాట్లు జరుగుతుండగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో 125 కేవీ, 62 జనరేటర్లు, రెండు డీసీఎం వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. 

8:58 PM IST:

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. భారత్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు 19.4 ఓవర్లలో ఛేదించారు. మిల్లర్ 59, అయిడెన్ మార్ క్రమ్ 52 పరుగులు చేశారు. 

8:06 PM IST:

గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

7:40 PM IST:

తిరుమల శ్రీవారి సేవా టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సుపథం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇతను కాణిపాకం దేవస్థానంలో గ్యాస్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

6:26 PM IST:

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ ఎదుట దక్షిణాఫ్రికా 134 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ 68 పరుగులు చేశాడు. ఎంగిడి 4, వ్యాన్ పార్నెల్ 3, నోకియా ఒక పరుగు చేశాడు. 

5:45 PM IST:

టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. 49 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 9 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. సూర్యక్రమార్ 8, దినేశ్ కార్తీక్ 1 పరుగుతో క్రీజులో వున్నారు

4:48 PM IST:

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఆదివారం మంగళగిరిలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక తీర్మానాలకు ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు జనసేన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటన చేసింది.  

4:07 PM IST:

టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు పాకిస్తాన్ విజయం సాధించింది. నెదర్లాండ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పెర్త్‌లో నెదర్లాండ్స్‌ నిర్దేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ 13.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ రిజ్వాన్ 49, ఫఖార్ జమాన్ 20, షాన్ మసూద్ 12 పరుగులు చేశాడు

2:50 PM IST:

వనపర్తి జిల్లా మక్తల్ టీఆర్ఎస్‌లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే చిట్టెం, టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత వర్కటం వర్గీయులను అడ్డుకున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆత్మకూరులో కురుమూర్తిస్వామి ఆభరణాల ఊరేగింపులో ఈ ఘటన చోటు చేసుకుంది. 

1:49 PM IST:

పాకిస్తాన్ టీం ఇక టీ20 వరల్డ్ కప్ నుండి వైదొలగనుందని... సేమీస్ కు చేరే అవకాశాలు చాలా తక్కువని బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డారు. చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో పాటు పసికూన జింబాబ్వే చేతిలో పాక్ ఓడిపోవడంపై స్పందిస్తూ బిన్ని ఈ వ్యాఖ్యలు చేసారు. 

12:42 PM IST:

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కు అనుమతిస్తూ ఇచ్చిన జీవో 51 ను కేసీఆర్ సర్కార్ వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారక ఆదేశాలిచ్చింది. 
 
11:33 AM IST:

సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం మధ్యాహ్నం జరిగిన పేలుళ్లలో 100 మంది చనిపోయినట్లు ఆ దేశాధ్యక్షుడు హసన్ షేక్ మహమూద్ తెలిపారు. కారులో బాంబ్ అమర్చి పేలుడుకు పాల్పడినట్లు అధ్యక్షుడు తెలిపారు. 

9:56 AM IST: