మైనర్ బాలికపై సవతి తండ్రి మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎట్టకేలకు.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ పట్టణంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కళ్యాణ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు వివాహం జరిగి.. ఒక కుమార్తె ఉంది. కొన్ని కారణాల వల్ల ఆమె భర్తతో విడాకులు తీసుకొని కూతురితో నివసిస్తోందతి. కాగా.. కటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు 2008లో  అతిక్ షేక్(52) అనే వ్యక్తిని వివాహమాడింది. షేక్.. ఆటో రిక్షా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కాగా.. అతనికి మొబైల్ ఫోన్ లో పోర్న్ వీడియోలు చేసే అలవాటు ఉంది. ఆ అలవాటు కాస్త ఇప్పుడు బానిసగా మారాడు.

కాగా..గత మూడేళ్లుగా షేక్.. తన భార్య కుమార్తెను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తల్లిని, ఆమె సోదరుడిని చంపేస్తానని బెదిరించి.. మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. ఇటీవల ఆ యువతి ఈ విషయాన్ని తన తల్లికి తెలియజేసింది.

దీంతో వెంటనే బాలిక తల్లి.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని కారణంగా తన కుమార్తె జీవితం నాశనం అయ్యింది.. చదువులో కూడా వెనకపడి పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు షేక్ ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.