Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు.... ఈమెను చంపితే 10లక్షలు!

పొరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్, ఎన్నార్సిలకు వ్యతిరేకంగా తలపెట్టిన సభలో అమూల్య పాకిస్తాన్ జిందాబాద్ అనే వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ఆమె ఆవ్యాఖ్యలు చేయగానే ఆ సభలోనే ఆసీనుడై ఉన్న అసదుద్దీన్ ఒవైసి వచ్చి మైక్ లాగేసుకున్నాడు. 

Sri ram sena offers 10 lakshs if amulya leona is killed for making controversial pakistan zindabad slogan
Author
Ballari, First Published Feb 22, 2020, 1:16 PM IST

కర్ణాటకలో రెండు రోజులకింద పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాన్నిచ్చిన అమూల్యను చంపితే 10 లక్షలు ఇస్తానని శ్రీ రామ్ సేన నేత సంజీవ్ మారాడి అన్నారు. బళ్లారిలో ఆయన అమూల్య వ్యాఖ్యలకు నిరసనగా రాళ్ళలో పాల్గొంటూ ఈ వ్యాఖ్యలను చేసారు. 

మొన్న నిర్వహించిన పొరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్, ఎన్నార్సిలకు వ్యతిరేకంగా తలపెట్టిన సభలో అమూల్య పాకిస్తాన్ జిందాబాద్ అనే వివాదాస్పద వ్యాఖ్య చేసింది. ఆమె ఆవ్యాఖ్యలు చేయగానే ఆ సభలోనే ఆసీనుడై ఉన్న అసదుద్దీన్ ఒవైసి వచ్చి మైక్ లాగేసుకున్నాడు. 

గతంలో పద్మావత్ సినిమా సందర్భంగా దీపికా పదుకొనె ను చంపినా ఆమె ముక్కును కోసి తెచ్చినా కూడా కోటి రూపాయల నుంచి పది కోట్ల రూపాయల వరకు నజరానాలు ఇస్తామని అప్పట్లో కొన్ని హిందూ సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో ఇలా అమూల్య ను చంపినా కూడా పది లక్షలు ఇస్తామన్న ప్రకట వెలువడింది. 

ఇక ఈ విషయమై అమూల్య తండ్రి స్పందించారు. ఆమె ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాంటి కూతురుని జైల్లో పెట్టినా తప్పు లేదని, ఆమె కోసం తాను ఏ విధమైన న్యాయపోరాటం చేయబోనని ఆయన అననారు. అమూల్య వ్యాఖ్యలు టీవీల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా ప్రతినిధులు ఆమె తండ్రిని సంప్రదించారు. 

Also Read: పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు: అమూల్యను ఆపేసిన అసదుద్దీన్ ఓవైసీ (వీడియో)

తన కూతురు ప్రవర్తన చూసి దిగ్బ్రాంతికి గురయ్యానని, ఇలా మాట్లాడవద్దని తాను చాలా సార్లు చెప్పానని, అయితే ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని ఆయన అన్నారు. ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తాను పట్టించుకోనని, ఆమె వల్ల తన కటుుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటోందని ఆయన చెప్పారు. 

తనకు బాగా లేదని, తాను హృద్రోగిని అని, తనను చూడడానికి రావాలని తాను అమూల్యకు చెప్పానని, అయితే నీ ఆరోగ్యం నువ్వే చూసుకో అని సమాధానం ఇచ్చిందని, అప్పటి నుంచి తాను ఆమెతో మాట్లాడలేదని ఆయన వివరించారు.

పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బెంగళూరులో జరిగిన సభలో అమూల్య ఒక్కసారిగా వైదికపైకి ఎక్కి పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసింది. దీంతో ఒక్కసారిగా అసదుద్దీన్ ఓవైసీ ఆమె వద్దకు వెళ్లి మైక్ ను లాక్కునే ప్రయత్నం చేశారు. 

అయినా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వచ్చి ఆమెను తీసుకుని వెళ్లారు. అమూల్య నినాదాలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఓవైసీ చెప్పారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios