Asianet News TeluguAsianet News Telugu

భారత పర్యటనలో స్పానిష్ జంట.. భర్తపై దాడి చేసి.. యువతిపై 10 మంది గ్యాంగ్ రేప్..

జార్ఖండ్‌లోని రాంచీలోని దారుణం జరిగింది. స్పెయిన్ దేశానికి చెందిన యువతిపై స్తానిక యువకుడు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Spanish woman gang raped in Jharkhand  Dumka, three detained KRJ
Author
First Published Mar 3, 2024, 4:16 AM IST

జార్ఖండ్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దుమ్కా జిల్లాలో స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు శనివారం తెలిపారు. వివరాల్లోకెళ్తే.. స్పెయిన్‌కు చెందిన ఓ పర్యాటక జంట ద్విచక్రవాహనంపై భారత్ మీదుగా బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వెళ్లాలని నిర్ణయించుకుంది.  

ఈ క్రమంలో ఆ జంట శుక్రవారం జార్ఝండ్ లోని దుమ్కా చేరుకుంది. అక్కడ పలు ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఈక్రమంలో హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుమహత్‌లో తాత్కాలికంగా ఓ డేరాను ఏర్పాటు చేసుకుని.. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రి 12గంటల సమయంలో కొందరు యువకులు టెంట్ లోకి చొరబడ్డారు. నిద్రపోతున్న మహిళను, ఆమె భర్తను దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ మహిళపై విచక్షణరహితంగా దాడి చేస్తూ.. సామూహికంగా అత్యాచారం చేశారు.

అంతే కాకుండా తీవ్రంగా కొట్టి, బెదిరింపులకు గురి చేశారు. వారు అడవి ప్రాంతంలో ఉండటంతో ఆమెకు సహాయం చేసేందుకు ఎవ్వరూముందు రాలేకపోయారు. ఈ దారుణం తరువాత బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. రేప్ కు గురైన తర్వాత యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ కేసుకు సంబందించిన దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ను ఏర్పాటు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు దుమ్కా ఎస్పీ తెలిపారు. 

ఈ ఘటనపై జర్ముండి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలోని హన్స్‌దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుమహత్‌లో శుక్రవారం రాత్రి స్పానిష్ పర్యాటక జంట తాత్కాలిక డేరాలో గడుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు  తెలిపారు.  శుక్రవారం రాత్రి గ్యాంగ్ రేప్ ఘటన జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో ఏడెనిమిది మంది స్థానిక యువకులు ప్రమేయం ఉందని తెలిపారు.

ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశామని, మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోందని అధికారి తెలిపారు. బాధితుడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వాస్తవానికి ఆ జంట మొత్తం ఆసియాను పర్యటించాలని నిర్ణయించుకుంది. ఆ జంట తొలుత పాకిస్థాన్, బంగ్లాదేశ్ లలో పర్యటించారు.ఆ తరువాత భారత్ మీదుగా  నేపాలా్ వెళ్లాలనేది వారి టూర్ ప్లాన్.ఇంతలోనే ఈ దారుణం జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios