Asianet News TeluguAsianet News Telugu

Aryan Khan Drugs Case : రియల్ హీరో సోనూసూద్ ట్వీట్.. పెద్దచెప్పొచ్చావ్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు...

 ఈ క్రమంలో పేరు ప్రస్తావించకుండా  sonu sood హిందీలో ట్వీట్ చేశారు.  ‘పిల్లలు విలువైన వారు.  నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోకండి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలి’ అంటూ రాసుకొచ్చాడు.

sonu sood and sussanne khan tweets to supports shah rukh khan son aryan khan
Author
Hyderabad, First Published Oct 6, 2021, 3:04 PM IST

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు aryan khan డ్రగ్ కేసు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శనివారం రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్ మీద దాడి చేసిన పోలీసులు ఆర్యన్ తో సహా పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఈ దాడిలో పోలీసులు పలురకాల నిషేధిత drugsను స్వాధీనం చేసుకున్నారు.  ప్రస్తుతం ఆర్య NCB కస్టడీలో ఉన్నారు.  ఈ క్రమంలో షారుక్ ji పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు,

ఇప్పటికే కండలవీరుడు సల్మాన్ ఖాన్,  సునీల్ శెట్టి,  పూజాభట్ లతోపాటు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.  రియల్ హీరో,  నటుడు సోనుసూద్, స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్ లు సైతం shahrukh khanకు మద్దతుగా నిలిచారు.

నిన్న ఆర్యన్ కు ముంబై కోర్టు బెయిల్ నిరాకరించింది.  అక్టోబర్ 7 వరకు ఎన్ సిబి  కస్టడీలో ఉండాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో పేరు ప్రస్తావించకుండా  sonu sood హిందీలో ట్వీట్ చేశారు.  ‘పిల్లలు విలువైన వారు.  నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. అప్పుడే మీరు దేవుడిలా పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోకండి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు అండగా ఉండాలి’ అంటూ రాసుకొచ్చాడు.

సోను సూద్ ఆర్యన్ ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారని భావించిన ఓ నెటిజన్ స్పందిస్తూ..  ‘23 ఏళ్ళ వయసులోనే  కపిల్ దేవ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలిచాడు.  23 ఏళ్ల వయసులో నీరజ్ చోప్రా ఒలంపిక్స్ గెలిచి  ఇండియాకు గోల్డ్ మెడల్ తెచ్చాడు. 23 ఏళ్ల వయసులోనే సచిన్ 1996 వరల్డ్ కప్ సమయంలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 

Aryan Khan : కొడుకును చూడడానికి షారూఖ్ కు అనుమతి.. తండ్రిని చూసి బోరుమన్న ఆర్యన్ ఖాన్..

ఇదే 23 ఏళ్ల వయసులో భగత్ సింగ్ దేశం కోసం ప్రాణ త్యాగం చేశాడు.  మరి 23 ఏళ్లకు ఆర్యన్  చిన్న పిల్ల వాడా?’ అంటూ కామెంట్ చేశాడు.  మరో  నెటిజన్  కూడా ‘ఆర్యన్ ఏంటో మాకు తెలుసు. 23 ఏళ్లలోనే అతడు రేవ్ పార్టీకి  వెళ్ళాడు అంటే..  అతను మంచి వాడా? చెడ్డవాడా? అనేది తెలిసిపోతుంది. అతడి అలవాట్లు ఎలా ఉంటాయో కూడా అంచనా వేయగలం.  జనాలు అంత పిచ్చి వాళ్ళు కాదు ఇప్పుడు మీరు అతడిని మంచి వాడిలా చూపించే ప్రయత్నం చేయకండి’ అంటూ కామెంట్ చేశాడు.

అలాగే హృతిక్ మాజీ భార్య సుసానే కూడా ట్వీట్ చేస్తూ ‘ఆర్యన్ మంచి పిల్లాడు.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నా..  ఒకవేళ అనుకోకుండా రాంగ్ ప్లేస్లో ఉండొచ్చు. కావాలనే అతడిని ఇందులో ఇరికించారేమో.  ఏం జరిగినా షారుక్, గౌరీ లకు నా మద్దతు ఉంటుంది’ అంటూ  ట్వీట్ చేసింది. అయితే వీరు చేసిన ట్వీట్ చూసిన నెటిజన్లు వీరిద్దరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios