Asianet News Telugu

పులి హత్య కేసు.. ఐదుగురు వేటగాళ్లు అరెస్ట్

స్నిప్పర్ డాగ్ సహాయంతో.. నిందితులను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా.. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నందుకు అటవీశాఖ అధికారులను అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభినందించారు.

Sniffer Dog Plays Key Role In Arrest Of 5 Tiger Poachers In Karnataka
Author
Hyderabad, First Published Sep 8, 2020, 9:53 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోందంటూ వన్య ప్రాణాల సంరక్షణ కేంద్రాలు మొత్తుకుంటున్నాయి. పులులను రక్షించండి అంటూ ప్రజలకు వారు సందేశాలు ఇస్తూనే ఉన్నారు.అయితే.. వాళ్లు ఎంత చెప్పినా.. పులులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ఓ పులి దారుణ హత్యకు గురయ్యింది.

నాగరహోల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఓ పెద్ద పులిని కొందరు వేటాడారు. కాగా..  టైగర్ ని హత్య చేసిన ఐదుగురు వేటగాళ్లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. స్నిప్పర్ డాగ్ సహాయంతో.. నిందితులను పట్టుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా.. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నందుకు అటవీశాఖ అధికారులను అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభినందించారు.

బండిపూర్ నేషనల్ పార్కుకు చెందిన స్నిఫర్ డాగ్ "రానా" వేటగాళ్ళను గుర్తించడంలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.

నాగరోల్ వద్ద వేటగాళ్ళు పులిని కాల్చి చంపారని అధికారులు చెప్పారు. తర్వాత పులి పంజా, దంతాలను కాజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. వారు ఈ దారుణానికి పాల్పడిన పదిరోజుల్లోనే నిందితులు ఐదుగురిని పట్టుకున్నామని చెప్పారు. వారి వద్ద నుంచి పులి పంజా, దంతాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios