Asianet News TeluguAsianet News Telugu

మరో ‘నిర్భయ’ కేసు : అంతా ఒట్టి ‘డ్రామా’.. ఛీ..ఇలాకూడా చేస్తారా?

గజియాబాద్ గ్యాంగ్ రేప్ స్టోరీ కట్టుకథ అని పోలీసులు తేల్చారు. దీంతో అసలు ఇలాంటి విషయాల్లో కూడా అబద్దాలు ఆడితే.. నిజంగా జరిగినా నమ్మరనే కామెంట్స్ వస్తున్నాయి. 

Shocker.. Ghaziabad Gang-Rape Story Cooked Up By The Woman Says Police
Author
First Published Oct 21, 2022, 9:12 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రెండు రోజుల కిందట వెలుగుచూసిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మహిళను అపహరించి, అత్యాచారం చేసి, శారీరకంగా హింసించడం ప్రకంపనలు పుట్టించింది. కాళ్ళు, చేతులు కట్టేసి..  జననాంగాల్లో ఇనుపరాడ్లు పెట్టి ఓ గోనె సంచిలో కుక్కేసి ఢిల్లీ ఘజియాబాద్ రూట్ లోని ఆశ్రమం రోడ్డు దగ్గర పడేశారని,  నిస్సహాయ స్థితిలో పడి ఉన్న ఆమెను గుర్తించి బుధవారం ఓ ఆస్పత్రిలో చేర్పించారని విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో  నిందితులను పోలీసులు అరెస్టు కూడా చేశారు.  

అయితే.. ఆమెతో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉండడంతో ఈ కేసును ఆ కోణంలోనే విచారణ చేపట్టారు.ఈ లోపు ఆమెకు పరీక్షలు నిర్వహించిన జీటీబీ ఆస్పత్రి వర్గాలు ఆమెకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదు అని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. పైగా ఆమె ఆచూకీ  లభించిన తరువాత రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్లగా.. వైద్య పరీక్షలకు ఆమె నిరాకరించడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.

యూపీలొ మరో నిర్భయ ఘటన.. రెండు రోజులపాటు గ్యాంగ్ రేప్.. ఇనుప రాడ్ తో..

చివరికి ఆమె మొబైల్ సిగ్నల్ ను ట్రేస్ చేసి అసలు విషయాన్ని పోలీసులు తేల్చేశారు. స్నేహితురాలి బర్త్ డే పార్టీ ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో.. కారులో వచ్చిన నిందితులు తనను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదు. అయితే ఆ సమయంలో ఆమెతో పాటు ఉన్న ఓ స్నేహితుడు అదే స్పాట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.  అంతే కాదు, బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ నుంచి ఆ స్నేహితుడికి పేటియం ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ అయిందని.. ఈ వ్యవహారాన్ని అత్యాచార కోణంలో ప్రచారం చేయించేందుకే అతనికి ఆమె డబ్బు ఇచ్చిందని పోలీసులు నిర్ధారించుకున్నారు.

ఆ ఐదుగురితో ఆస్తి తగాదాలు ఉండటంతోనే ఆమె అలా నాటక మాడిందని యూపీ రీజినల్ పోలీస్ చీఫ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.  తనపై రెండు రోజులు సామూహిక అత్యాచారం జరిగింది అని చెబుతున్న సమయంలో ఆమె తన స్నేహితులతో రిసార్ట్ లో గడిపి.. ఆ తర్వాత వాళ్ళ సహకారంతోనే గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పోలీసులు దర్యాప్తులో తేల్చేశారు. పోలీసులు ఈ ఘటనపై బాధితురాలి నుంచి గాని మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ నుంచి గాని ఎలాంటి స్పందన రాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios