గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో ఢీ అంటే ఢీ అంటున్న శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ముఖ్య అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు శివసేన వెల్లడించింది.

ఈయనతో పాటు మరో పది మంది సభ్యులు సేన అధికార ప్రతినిధులుగా నియమితులయ్యారు. వీరిలో కొందరు లోక్‌సభ ఎంపీలు కూడా ఉన్నారు. తనకు కొత్త పదవి లభించిందని సంజయ్ పేర్కొన్నారు.

ప్రస్తుతం శివసేన అధికార పత్రిక సామ్నాలో కీలక వ్యాసాలు రాస్తున్న ఆయన.. ఇకపై పార్టీ తీసుకునే నిర్ణయాలను, కార్యాచరణ తదితరాలను మీడియాకు వివరించనున్నారు.

Also Read:'మహా' జగడం: బాలీవుడ్ నటి కంగనాకు బిఎంసీ బిగ్ షాక్

ఇదిలావుంటే కంగనా రౌత్, మహారాష్ట్రలోని శివసేన సర్కారు మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగనా రౌత్, అక్కడి శివసేన పార్టీ ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలోనే కంగనా సెప్టెంబర్ 9 న ముంబై చేరుకుంటుంది.

ఈ మేరకు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో సమాచారం ఇచ్చింది. దీంతో శివసేన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ ను కూడా కంగనా సవాలు చేసింది.

ముంబై చేరుకోనున్నన్న కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు క్వారంటైన్ పేరుతో నిర్బంధించవచ్చని వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం, ముంబై చేరుకున్న కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు నిర్బంధించడానికి బిఎంసి సన్నాహాలు చేస్తోంది.

మరోవైపు కంగనాను ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్ అందుకు క్షమాపణలు చెప్పనప్పటికి.. తాను పోరపాటు చేసి వుండొచ్చని ఓ జాతీయ ఛానెల్‌తో అన్నారు.

కంగనా కూడా తప్పులు చేసిందన్న ఆయన.. తాము ఎన్నోసార్లు చూశామని అన్నారు. ముంబై పోలీసులు, పరిపాలనపై ఆమెకు నమ్మకం లేకపోతే ఆమె ఇక్కడ ఉండటం ఎందుకని సంజయ్ ప్రశ్నించారు.

Also Read:మీరు నన్ను ఇక్కడ అంతం చేసినా.. మూవీ మాఫియాపై కంగనా

మరోవైపు కంగనా రనౌత్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రౌత్ మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర గురించి, ముంబాదేవికి చెందిన ముంబై గురించి అవమానకరమైన భాషలో మాట్లాడే వ్యక్తికి భద్రత ఇవ్వడం సరైనదని భావిస్తే అలాగే ఉండండని అన్నారు.

ఇలాంటి మహిళకు ఈ దేశంలో భద్రత కల్పించాలని జాతీయ మహిళా కమీషన్ భావిస్తోందని.. కానీ మహారాష్ట్ర పోలీసులు అంతా చూస్తున్నారని సంజయ్ స్పష్టం చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆమెకు ఏదైనా తెలిస్తే అందుకు తగిన సాక్ష్యాధారాలను సమర్పించాలని ఆయన కంగనాను కోరారు.