ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు. ఎక్కడ బయటకు వస్తే.. కరోనా సోకుంతుందోనని ఎవరూ బయటకు కూడా రావడంలేదు. కేవలం తుమ్ము, దగ్గులతోనే కరోనా వ్యాప్తి చెందుతుండటంతో అందరూ భయపడిపోతున్నారు. అందులోనూ లాక్ డౌన్ అమలులో ఉండటంతో చాలా మంది స్వస్థలాలకు కూడా వెళ్లలేకపోతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ నోయిడాలో వ్యభిచారం నిర్వహించడం గమనార్హం.  అయితే.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. సోదాలు నిర్వహించారు.ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని అరెస్టు చేయగా.. వారిలో ఇద్దరు యువతులు ఉన్నారు.

గ్రేటర్ నోయిడాలోని ఓ గెస్ట్ హౌస్ లో ఈ వ్యభిచారం నిర్వహించడం గమనార్హం. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకుడు, గెస్ట్ హౌస్ యజమానిని కూడా అదుపులో తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. వారి వద్ద నుంచి రూ.12,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లు, మేకప్ కిట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.