Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి పేరుతో శృంగారం.. నేరం కాదా..?

పెళ్లి చేసుకుంటాననే తప్పుడు హామీలకు సంబంధించిన కేసుల్లో ఓ పార్టీ సమ్మతిని బలహీనపరిచే అవకాశం ఉంటుందని, ఆ విధంగా భారత శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం నేరం అవుతుందని తెలిపింది. 

Sex on Pretext of Marriage Not Always Rape: Delhi High Court Acquits Man of Charges
Author
Hyderabad, First Published Dec 17, 2020, 12:55 PM IST

పెళ్లి చేసుకుంటామని నమ్మించి.. శృంగారంలో పాల్గొన్న తర్వాత కాదుపొమ్మన్నాడని.. ఈ మధ్యకాలంలో చాలా మంది కేసులు పెడుతున్నారు. వాటిని కూడా అత్యాచారం కిందే పరిగణిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా.. ఇలాంటి కేసులపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

 పురుషునితో స్త్రీ చాలా కాలం అన్యోన్యంగా ఉన్నట్లయితే, పెళ్లి పేరుతో సెక్స్ చేయడం అత్యాచారం కాబోదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నిరవధికంగా, సాధారణం కన్నా ఎక్కువ కాలంపాటు అన్యోన్యంగా ఉన్నపుడు, పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని సెక్స్ వైపు ఆకర్షించేందుకు ప్రోత్సహించడంగా చెప్పలేమని తెలిపింది. కొన్ని కేసుల్లో పెళ్ళి చేసుకుంటాననే వాగ్దానం చేసిన తర్వాత సెక్స్‌‌కు అంగీకరిస్తారని గుర్తు చేసింది. జస్టిస్ విభు భక్రు ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. 


పెళ్లి చేసుకుంటాననే తప్పుడు హామీలకు సంబంధించిన కేసుల్లో ఓ పార్టీ సమ్మతిని బలహీనపరిచే అవకాశం ఉంటుందని, ఆ విధంగా భారత శిక్షా స్మృతి ప్రకారం అత్యాచారం నేరం అవుతుందని తెలిపింది. సాధారణం కన్నా ఎక్కువ కాలంపాటు అన్యోన్యంగా ఉన్న సందర్భంలో దీనిని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని పేర్కొంది. 

ఓ యువతి దాఖలు చేసిన కేసుపై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. నిందితునితో తనకు 2008లో శారీరక సంబంధం ఏర్పడిందని, ఆ వ్యక్తి తనను పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చాడని ఫిర్యాదుదారు ఆరోపించారు. మూడు నెలల తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని ఆ వ్యక్తి హామీ ఇవ్వడంతో తాను ఆయనతో కలిసి వెళ్లానని చెప్పారు. నిందితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఆరోపణల నుంచి నిందితునికి హైకోర్టు విముక్తి కల్పించింది. అతనిని నిర్దోషిగా విడుదల చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios