Asianet News TeluguAsianet News Telugu

పెళ్లికి ముందు వివాహేతర సంబంధం అత్యాచారం కాదు: ఒడిశా హైకోర్టు

పెళ్లి చేసుకొంటానని ప్రలోభ పెట్టి యువతితో వివాహేతర సంబంధం కొనసాగించడం అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు తెలిపింది.

Sex on false promise of marriage not rape, tells Odisha High Court
Author
Odisha, First Published May 24, 2020, 10:47 AM IST

భువనేశ్వర్:పెళ్లి చేసుకొంటానని ప్రలోభ పెట్టి యువతితో వివాహేతర సంబంధం కొనసాగించడం అత్యాచారంగా పరిగణించరాదని ఒడిశా హైకోర్టు తెలిపింది.

శనివారం నాడు జస్టిస్ ఎస్ కె పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం కీలకమైన తీర్పును వెల్లడించింది.పెళ్లి చేసుకొంటానని చెప్పి తనను మోసం చేశాడని 19 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు  జి. అచ్యుత్ కుమార్ పై కేసు నమోదైంది. ఈ కేసులో బాధితురాలికి నిందితుడు రెండు దఫాలు గర్భస్రావం చేయించినట్టుగా  బాదితురాలి తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Sex on false promise of marriage not rape, tells Odisha High Court

కొరాపుట్ జైపూర్  కోర్టు నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో అచ్యుత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేసింది.బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

also read:లాక్ డౌన్ వేళ చర్చిలో మహిళతో రాసలీలలు: అడ్డంగా బుక్కయిన పాస్టర్

పెళ్లి చేసుకొంటామని భావించిన కొందరు శారీరకంగా కలుస్తున్నారు. యువకుడు పెళ్లికి నిరాకరిస్తే అత్యాచారం జరిగినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను అత్యాచారాలుగా పరిగణించరాదని కోర్టు అభిప్రాయపడింది.

పెళ్లి చేసుకొంటారని భావించి శారీరకంగా కలిసిన తర్వాత ఏదైనా కారణం చేత వివాహం చేసుకోవడానికి అభ్యంతరం చెబితే  అత్యాచారం కింద కేసు పెట్టడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios