"సెక్స్ కాదంట.. ఎగ్స్ అంట.." తృణమూల్ ఎంపీ అసలు వీడియో ఇదే..
లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ ప్రజాబాట పట్టాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రజలవద్దకు వెళుతూ తమను గెలిపించాలని కోరుతున్నారు. ఇలా ప్రచారపర్వంలో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరూ నేతల వీడియోలను తప్పుగా వక్రీకరిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలి వీడియో కూడా తప్పుగా ఎడిట్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణానగర్ లోక్ సభ స్ధానంనుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మహువా మొయిత్రా మళ్లీ పోటీ చేస్తున్నారు. 2019 లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీచేసి గెలిచారు.దీంతో మళ్ళీ ఆమెనే బరిలోకి దింపింది టిఎంసి. ఈ క్రమంలో తన లోక్ సభ నియోజకవర్గంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు మహువా. అయితే ఇలా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ మహువా మాట్లాడినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వాస్తవానికి ఆమె ప్రచారం లో పాల్గొంటున్న సమయంలో ఓ జర్నలిస్ట్ ఆమెను ఇంటర్య్వూ చేస్తున్నారు. ఈ సమయంలో మహువా మోయిత్రా నాయకురాలి ప్రశ్నిస్తూ.. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటీ? అడిగారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. 'ఎక్స్ ఈజ్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ' అని పేర్కొంది. ఈ వీడియోలో ఎగ్స్ ఫ్లేస్ లో సెక్స్ అని కొంత మంది దుండగులు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం మార్ఫింగ్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతుంది.
ఈ వైరల్ వీడియో నేపథ్యంలో తృణమూల్ నాయకురాలు మహువా మొయిత్రాను ఇంటర్య్వూ చేసిన జర్నలిస్ట్ తమల్ సాహా స్పందించారు. ఆయన అసలు విషయాన్ని బయటకు పెట్టారు. ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా ట్యాంపర్ చేశారని పేర్కొన్నారు. ’’ ఇది నా ఇంటర్వ్యూ.. కాబట్టి, నన్ను స్పష్టం చేయనివ్వండి. నేను తృణమూల్ నాయకురాలు మహువా మొయిత్రాను ఇంటర్య్వూ చేశారు. ఆ సమయంలో మీ శక్తికి మూలం ఏమిటి ప్రశ్నించగా.. మహువా మొయిత్రా . EGGS …," అని బదులిచ్చారు. కానీ, కొంత ప్రత్యార్థులు EGGS ను s*x లాగా వక్రీకరించారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఆడియో ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారు" అని ఆయన అన్నారు. ఈ తరుణంలో జర్నలిస్ట్ సాహా తన X పోస్ట్‌లో పూర్తి ఇంటర్వ్యూ వీడియో లింక్‌ను కూడా పోస్ట్ చేశాడు. అయినప్పటికీ.. కొంతమంది నెటిజన్లు 'సెక్స్' లేదా 'ఎగ్స్' అంటూ కామెంట్ చేస్తున్నారు.