Asianet News TeluguAsianet News Telugu

‘తొలి’ అనుభవంలో అమ్మాయిలు చాలా ముందున్నారు

శృంగారంలో తొలి అనుభవంపై షాకింగ్ సర్వే

Sex in India: What data shows

జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ(ఎన్ఎఫ్ హెచ్ఎస్).. తాజాగా ఓ సర్వే చేపట్టింది. యువతరం తొలిసారిగా శృంగారంలో ఎప్పుడు పాల్గొంటున్నారు అనే విషయం పై వారు జరిపిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతీయుల లైంగిక జీవితానికి సంబంధించిన అనేక కీలక విషయాల్ని ఈ సర్వే బయటపెట్టింది. 

దాదాపు లక్షమంది పురుషులు, మరో లక్షమంది మహిళలపై కుటుంబ ఆరోగ్య సర్వే చేశారు. వయసుల మధ్య వ్యత్యాసాలు, పడక సుఖాల్ని పొందడంలో వివిధ గ్రూపుల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యాభ్యాసం వల్ల సెక్స్‌ను వాయిదావేసుకోవడం... ఇత్యాది విషయాల్ని సర్వే చర్చించింది.

ఈ సర్వే ప్రకారం.. అమ్మాయిలు 19 ఏళ్లలోపే లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని పేర్కొంది. పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి అనుభవాన్ని పొందుతున్నారని తెలిపింది. 

అమ్మాయిలకు యుక్త వయసులో వివాహం అవుతుండటంతోనే వారు అబ్బాయిలతో పోలిస్తే తొందరగా తొలి అనుభవాన్ని పొందుతున్నారని ఎన్ఎఫ్ హెచ్ఎస్ తెలిపింది. పెళ్లికి ముందు సెక్స్ పై నిషేధం ఉన్నప్పటికీ.. 24 ఏళ్లలోపు పురుషుల్లో 11 శాతం మంది, స్త్రీలలో 2 శాతం సెక్స్ లో పాల్గొన్నట్టు వెల్లడించారు.ఈ వయసున్న గ్రూపులో పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న పురుషుల్లో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌లో 21.1% మంది, మధ్యప్రదేశ్‌లో 20.7% మంది ఉన్నారు.

ఇదే సందర్భంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో చురుకుగా లైంగిక జీవితాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది. హరియాణ, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో సర్వేలో పాల్గొన్న దాదాపు 55 శాతం మంది చాన్నాళ్ల ముందు నుంచే తాము సెక్స్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios