దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతిరోజూ 4లక్షల మందికి కరోనా సోకుతోంది. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం ఆక్సీజన్ కూడా దొరకక ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య వేలల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. 

ఆక్సీజన్ కోసం అలమటిస్తున్నవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని.. దారుణంగా ప్రవర్తిస్తున్నారు.  తాజాగా.. అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఈ మేరకు ఓ ట్వీట్ చేయగా.. ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఓ వ్యక్తికి కరోనా సోకగా..అతనికి ఆక్సీజన్ అవసరం అయ్యింది. ఎంత ప్రయత్నించినా... అతనికి ఆక్సీజన్ దొరకలేదు. అలాంటి సమయంలో అతని కూతురికి పక్కింటి వ్యక్తి ఓ ఆఫర్ ఇచ్చాడు. మీ నాన్నకి ఆక్సీజన్ సిలిండర్ కావాలంటే.. నువ్వు నా సెక్స్ కోరిక తీర్చాలి అంటూ.. అతను ఆఫర్ చేయడం గమనార్హం.


సదరు యువతికి ఎదురైన ఈ ఘటనను.. ఆమో సోదరిలాంటి మరో యువతి ట్విట్టర్ లో షేర్ చేసింది. కాగా.. ఈ ట్వీట్ వైరల్ కావడంతో... వేల మంది ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. నెటిజన్లు అయితే.. విపరీతంగా మండిపడుతున్నారు. మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి వాళ్లకు శిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు..