కోయంబత్తూరు:తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో  బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు. 

కోయంబత్తూరులోని సుందరాపురంలో  బస్టాండ్‌లోకి  ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో  ముగ్గురు మహిళలు, ఇద్దరు కాలేజీ విద్యార్ధులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు కూడ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ఈ ఘటనలో  మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బస్‌స్టేషన్‌లోని జనంపైకి దూసుకెళ్లింది. 

అయితే కారు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడ విషమంగా ఉందని  వైద్యులు ప్రకటించారు.