భోపాల్: ఓ స్వామి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన చర్యకు పాల్పడ్డాడు. ముగ్గురు మైనర్ బాలికలపై అతను అత్యాచారం చేశాడు. ఆ ముగ్గురు బాలికలు కూడా అక్కాచెల్లెళ్లు. కాలసర్పదోషం నుంచి రక్షిస్తానని నమ్మబలికి అతను ఆ దారుణానికి పాల్పడ్డాడు.

స్వామి దురాగతం గురించి పోలీసులు గురువారం మీడియాకు వివరించారు. సాత్నా జిల్లాలోని దేహాత్ పోలీసు స్టేషన్ పరిధిలో గల నాదాన్ గ్రామానికి చెందిన బాబా నారాయణ స్వరూప్ త్రిపాఠీ (56) స్వామి వేషంలో ఆ దారుణానికి పాల్పడ్డాడు. 

స్వామి నవంబర్ 9వ తేదీన బాలికలపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారంనాడు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికల తండ్రి పోలీసులకు చెప్పడంతో అతని గుట్టు రట్టయింది.

చిన్న కూతురు జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పిందని, ఆ తర్వాత మిగతా ఇద్దరు కూడా తాము అనుభవించిన బాధను వివరించారని పోలీసులు చెప్పారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.