జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా వేరినాగ్ ప్రాంతంలో శనివారం భాతర భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య భీకర పోరు జరిగింది. భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

శనివారం తెల్లవారుజామున వేరినాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా జవాన్లు గాలింపు చేపట్టారు. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. శుక్రవారం పుల్వామా సమీపంలోని పంజరన్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన నలుగురు మరణించారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.