తనకు సామర్థ్యం లేదు.. అందుకే అసహజ సెక్స్ తో ఇబ్బంది పెడుతున్నాడు

First Published 19, Jul 2018, 10:25 AM IST
Section 377 verdict nears, wife wants man booked for un natural sex
Highlights

భర్తపై కోర్టుకి ఎక్కిన భార్య.. తనకు న్యాయం చేయాలని డిమాండ్

తన భర్త తనతో అసహజంగా సెక్స్ చేస్తున్నాడని.. దానికి ఒప్పుకోకపోతే.. చిత్ర హింసలకు గురిచేస్తున్నాడంటూ.. ఓ భార్య ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించింది. ఈ సంఘటన  గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..గుజరాత్ రాష్ట్రంలోని సబర్ కాంత పట్టణానికి చెందిన యువతికి ఓ డాక్టరుతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి అయిన నాటి నుంచి తన భర్త  అసహజంగా సెక్స్ చేస్తున్నాడని బాధితురాలైన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

భార్య ఇచ్చిన ఫిర్యాదుపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అంతలో భర్త తన భార్య ఫిర్యాదును కొట్టివేయాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. గుజరాత్ హైకోర్టు ఆమె ఫిర్యాదును తిరస్కరించింది. 

దీంతో తన భర్త సెక్స్ సామర్ధ్యం లేనందువల్ల తనపై అసహజ సెక్స్ చేస్తున్నాడని భార్య ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసహజ సెక్స్ కు అంగీకరించకుంటే భర్త తనను తిట్టడమే కాకుండా బెదిరిస్తూ కొడుతున్నాడని భార్య ఆవేదనగా సుప్రీంకోర్టుకు విన్నవించింది. 

మహిళ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దర్యాప్తు బాధ్యతను జస్టిస్ ఎన్ వి రమణ, ఎం ఎం శంతన్ గౌదార్ ల ధర్మాసనానికి అప్పగించింది. దీంతో సుప్రీంకోర్టు  నిందితుడైన భర్తకు నోటీసులు జారీ చేసింది.

అంతేకాకుండా సదరు భర్తకి తనదైన శైలిలో కోర్టు చివాట్లు పెట్టింది. అసహజ రీతిలో సెక్స్ చేయాలని చూడటం ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం నేరమని సుప్రీంకోర్టు జడ్జీలు వ్యాఖ్యానించారు.
 

loader