Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులు, టీచర్ల వాట్సప్ గ్రూప్ లో పోర్న్ వీడియోలు షేర్... ఉపాధ్యాయుడు అరెస్ట్...

మతివన్నన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దశాబ్దానికి పైగా గణితం బోధిస్తున్నాడు. నగరంలోని అంబత్తూరులో తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. విద్యార్థుల ఆన్‌లైన్ బోధన కోసం ఉపయోగించే గ్రూప్‌కు ఉపాధ్యాయుడు రాత్రి సమయంలో Porn videoను పంపాడు. గ్రూప్‌లో పోర్న్ వీడియోలు రావడంతో షాక్‌కు గురైన పిల్లలు, తోటి ఉపాధ్యాయులు పాఠశాల అధికారులను అప్రమత్తం చేశారు. 

school teacher shares porn video in school whatsapp group, arrested in tamilnadu
Author
Hyderabad, First Published Dec 20, 2021, 11:50 AM IST

చెన్నై : ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై ఆకృత్యాలు Sexual assaults, harassmentజరుగుతూనే ఉన్నాయి. తప్పు చేసినవారిలో ఎంతమందికి ఎన్ని కఠిన శిక్షలు విధించినా.. క్షణికానందం కోసం తప్పు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా  పోర్న్ చిత్రాలు..  కామ కోరికలకు  తెరలేపి… ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నాయి. చిన్నారులపై దారుణాలను ఆపాలంటే వాళ్లను ఎల్లవేళలా తల్లిదండ్రులు కనిపెట్టుకుని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి.  అనవసరమైన వీడియోలు, దారుణాలను ప్రేరేపించే ఘటనలకు, వ్యక్తులకు దూరంగా ఉంచాలి.

Tamil Naduలోని ఇలాంటి నీఛమైన ఘటనే జరిగింది. 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన School Group‌లో ప్రైవేట్ స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్ మతివన్నన్‌ పోర్న్ వీడియోలు షేర్ చేశాడు. అతన్ని శుక్రవారం రాత్రి  పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

మతివన్నన్ చెన్నైలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో దశాబ్దానికి పైగా గణితం బోధిస్తున్నాడు. నగరంలోని అంబత్తూరులో తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. విద్యార్థుల ఆన్‌లైన్ బోధన కోసం ఉపయోగించే గ్రూప్‌కు ఉపాధ్యాయుడు రాత్రి సమయంలో Porn videoను పంపాడు. గ్రూప్‌లో పోర్న్ వీడియోలు రావడంతో షాక్‌కు గురైన పిల్లలు, తోటి ఉపాధ్యాయులు పాఠశాల అధికారులను అప్రమత్తం చేశారు. 

మైనర్లకు మ్యూజిక్ పాఠాలు... టీచర్ వద్ద లక్షలకొద్దీ చిన్నారుల నీలిచిత్రాలు

పాఠశాల అధికారుల అంతర్గత విచారణలో మతివన్నన్ వీడియో గురించి తనకు తెలియదని, మద్యం మత్తులో షేర్ చేశానని చెప్పాడు. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం చెన్నైలోని ఆల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు పోక్సో చట్టం, ఐటీ చట్టం కింద అతన్ని అరెస్టు చేశారు. ఉపాధ్యాయుడిని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

కాగా, తాజాగా ఇటలీలో ఓ సంగీతకారుడు వద్ద చిన్నారులపై అఘాయిత్యాలు ప్రేరేపించే లక్షలకొద్దీ child pornography  వీడియోలను గుర్తించారు.  వెంటనే అతడిని అరెస్టు చేశారు. ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇటలీలోని మార్చే రీజియన్లోని అంకోనా సిటీలో ఒక సంగీత కారుడు (49) చిన్నారులకు సంగీత పాఠాలు చెప్పేవాడు.  చిన్నారులకు సంగీతం నేర్పించే అతని వద్ద లక్షలకొద్దీ నీలిచిత్రాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

ఇంట్లో సోదాలు చేయగా.. చిన్నారుల నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు లక్షలకొద్దీ లభ్యమయ్యాయి. ప్రస్తుతం అతని వయసు 49 ఏళ్లు... కాగా 30 ఏళ్ల వయసు నుండే అతను చిన్నారుల నీలి చిత్రాలు వీడియోలు, ఫోటోల సేకరణ ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు.చిన్నారులతో పెద్దలు లైంగిక కార్యకలాపాల్లో ఎలా పాల్గొంటున్నారన్న వీడియోలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. 

వాటిని వివిధ కేటగిరీలుగా విభజించి.. హార్డ్ డిస్క్ లో వివిధ రకాలుగా స్టోర్ చేసి ఉంచాడు. వీడియోలు ఫోటోలు పోలీసులు స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేశారు. కాగా,నిందితుడు వద్ద సంగీతం  నేర్చుకునేందుకు వచ్చే చిన్నారుల్లో ఎవరైనా లైంగిక వేధింపులకు గురయ్యారా? వీడియోల చిత్రీకరణకు ఆ చిన్నారులను కీచక టీచర్ ఉపయోగించుకున్నాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకైతే తమ విచారణలో అలాంటి ఘటనలు ఏవి బయటపడలేదని.. చిన్నారుల తల్లిదండ్రులు ఎవరు అలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios