10 హత్యలు, 3 రేప్ లు: ఎట్టకేలకు చిక్కిన మాఫియా డాన్

Sampath Nehra nabbed at miyapur in Hyderabad
Highlights

అతనిపై పది హత్య కేసులు, మూడు అత్యాచారం కేసులు, పదుల సంఖ్యలో దోపిడీ, బెదిరింపుల కేసులున్నాయి.

హైదరాబాద్: అతనిపై పది హత్య కేసులు, మూడు అత్యాచారం కేసులు, పదుల సంఖ్యలో దోపిడీ, బెదిరింపుల కేసులున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల పోలీసులకు అతను ఓ సవాల్ గా మారిపోయాడు. ఎట్టకేలకు హైదరాబాదులో పట్టుబడ్డాడు. 

అతను మాఫియా డాన్ సంపత్ నెహ్రా. హైదరాబాదులోని మియాపూర్ లో అతను పోలీసుల కళ్లు గప్పి తలదాచుకుంటున్నాడు. అతని ఆచూకీపై పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ, హర్యానా రాష్ట్ర టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అతన్ని పట్టుకున్నారు.

సంపత్‌ హర్యానాలో మాఫియా డాన్‌గా ఎదిగాడు. పలు అకృత్యాలకు పాల్పడ్డాడు. తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్‌, రాజస్థాన్‌ లకు కూడా విస్తరించాడు. ఎదురు తిరిగినవారిని ఆనవాళ్లు లేకుండా అంతమొందిస్తాడు. 

అయితే పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు దాడులు జరపడంతో 20 రోజుల క్రితం హైదరాబాదుకు పారిపోయి వచ్చాడు. హైదరాబాదులో పట్టుబడిన నిందితుడి నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. 

loader