అసోం ఎన్‌ఆర్‌సీ బిల్లు: అమిత్‌షా ప్రకటనపై కాంగ్రెస్ అభ్యంతరం, రాజ్యసభ వాయిదా

RS adjourned as MPs express anger over Amit Shah's remarks on NRC
Highlights

ఎన్‌ఆర్‌సీ ముసాయిదా బిల్లుపై  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌‌షా ప్రకటనపై  రాజ్యసభలో  కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన నేపథ్యంలో  సభ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయమేర్పడింది.


న్యూఢిల్లీ:  ఎన్‌ఆర్‌సీ ముసాయిదా బిల్లుపై  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌‌షా ప్రకటనపై  రాజ్యసభలో  కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన నేపథ్యంలో  సభ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయమేర్పడింది. కాంగ్రెస్ సభ్యులు  పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. పదే పదే రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు  సభ్యులను కోరినా వినలేదు. దీంతో రాజ్యసభను బుధవారం నాడు మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు.

రాజ్యసభ ప్రారంభం కాగానే  కాంగ్రెస్ పార్టీ సభ్యులు  నిన్న రాజ్యసభలో  బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ అమిత్ షా ఎన్‌ఆర్సీపై చేసిన కామెంట్స్‌పై  కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.  అమిత్ షా ప్రకటనపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన నిర్వహించారు.  అసోం ఎన్ఆర్‌సీ ముసాయిదా బిల్లు విషయమై  అమిత్‌షా చేసిన ప్రకటనపై  కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  

రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు  కాంగ్రెస్ సభ్యులకు పదే పదే విన్నవించినా వారు శాంతించలేదు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేస్తున్నట్టు  వెంకయ్యనాయుడు ప్రకటించారు. 
 

loader