అంతర్జాతీయంగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్ తో పోలిస్తే 71.21  క్షీణించి వుంది. ఇలా నిరాటకంగా రూపాయి విలువ పతనమవడంతో క్రూడాయిల్‌ ధరలకు కూడా రెక్కలొచ్చాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ పెరిగిన నేపథ్యంలో స్కూల్ బస్సు ఫీజులు పెంచాలని ముంబై స్కూల్ బస్సు ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.ఇందుకోసం ఇప్పటికే స్కూల్ యాజమాన్యాలతో చర్చలు జరుపుతున్నారు.

ఇటీవల  అద్దూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా బస్సులు నడపడం కష్టంగా మారిందని ముంబై స్కూల్ బస్సు యజమానుల సంఘం ప్రతినిధి అనిల్ గార్గ్ తెలిపారు. ఖర్చులు పెరిగాయి కానీ ఆదాయం మాత్రం పెరక్క పోవడంతో బస్సులు నడపలేని పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. దీంతో నెలకు స్కూల్ బస్సు ఫీజులు వంద రూపాయలు పెంచాలని స్కూల్ యాజమాన్యాలకు లేఖ రాసినట్లు అతడు తెలిపాడు. అక్టోబర్ నెల నుండి ఈ స్కూల్ బస్సు చార్జీల పెంపును  అమలుచేయాలనుకుంటున్నట్లు అనిల్ గార్గ్ తెలిపాడు.

ఇలా చుట్టు తిరిగి మళ్లీ సామాన్యుడిపైనే భారం పడనుంది. ఇప్పటికే పెట్రోలో లీటర్ ధరలు పెరిగి ప్రత్యక్షంగా భారం పడుతుండగా తాజాగా ఇలా పిల్లల స్కూల్ బస్సు చార్జీలు పెరుగుతుండంతో పరోక్షంగా భారం పడుతునుందంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు.