జైపూర్: రాజస్థాన్ లో అత్యంత భయానకమైన సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర భయాందోళనలకు గురైన టీనేజ్ అమ్మాయి వారి నుంచి తప్పించుకునేందుకు నగ్నంగా పరుగు తీసింది. అంతకు ముందు కొట్టి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. 

దారుణానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలిక తన కజిన్, ఫ్రెండ్ తో కలిసి బిల్వారాలోని ఫెయిర్ నుంచి తిరిగి వస్తూ ఆలయానికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. కజిన్ వారి నుంచి తప్పించుకోగలిగింది. అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశానికి లాక్కెళ్లి దాడి చేసి ఆమెపై అత్యాచారం చేశారు. 

కజిన్ సమీపంలోని మార్కెట్ కు వెళ్లి జరిగిన విషయాన్ని అందరికీ చెప్పడం జరిగింది. సహాయం కోసం దుకాణుదారుడిని వేడుకోవడం జరిగింది. షాప్ కీపర్ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. అతన్ని చూసి దుండగులు పారిపోయారు. 

ఒంటిపై దుస్తులు లేకుండా బాలిక పరుగు తీస్తున్న విషయాన్ని షాప్ కీపర్ పోలీసులకు తెలియజేశాడు. అతన్ని చూసి కూడా బాలిక భయపడి అలా పారిపోయినట్లు భావిస్తున్నారు. దాదాపు అర కిలోమీటరు దూరం వరకు అలాగే పరుగెత్తింది. చివరికి ఆగిపోయి, షాప్ కీపర్ ఇచ్చిన దుస్తులను తీసుకుంది. 

బాలిక తన ఇద్దరు మిత్రులతో పాటు ఆలయానికి వెళ్తుండగా ముగ్గురు అనుమానితులు రోడ్డు మీదే తాగుతున్నారని, వారిని చేసి వెంటపడ్డారని, బాధితురాలి మిత్రులు పారిపోగలిగారని, టీనేజ్ అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశానికి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశారని పోలీసులు చెబుతున్నారు. 

పోలీసులు పగిలిన గాజులను, లిక్కర్ బాటిల్స్ ను, రక్తం మరకలను సంఘటనా స్థలం నుంచి సేకరించారు. షఆప్ కీపర్, ఆమె మిత్రులు, ఆమె వాంగ్మూలాలను పోలీసులు తీసుకున్నారు.