పెద్దల దాష్టీకం: రేప్ బాధితురాలిపై ఊరంతా కలిసి దాడి

First Published 12, Sep 2018, 7:41 AM IST
Rape Victim thrashed after Khap Panchayat's order
Highlights

మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన ఖాప్ పంచాయతీ అత్యంత దారుణమైన చర్యకు పాల్పడింది. నిందితుడిపై కేసు పెట్టినందుకు 14 అత్యాచార బాధితురాలిపై దాడి చేశారు. 

భోపాల్: మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన ఖాప్ పంచాయతీ అత్యంత దారుణమైన చర్యకు పాల్పడింది. నిందితుడిపై కేసు పెట్టినందుకు 14 అత్యాచార బాధితురాలిపై దాడి చేశారు. స్థానిక ఖాప్ పంచాయతీ ఆదేశాల మేరకు గ్రామానికి చెందిన పురుషులు, మహిళలు అత్యాచార బాధితురాలిని కొట్టారు. 

ఆ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఛత్తీస్ గడ్ ఉత్తర బస్తర్ జిల్లాలోని కంకేర్ బిష్ణుపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు రెండు వీడియోలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

గ్రామానికి చెందిన నిరసు బిస్వాస్ (65) అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు రెండు రోజుల క్రితం బండె పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

కోర్టు వెలుపల వివాదాన్ని పరిష్కరించడదానికి గ్రామ పెద్దలు సమావేశం నిర్వహించారు. బాధితురాలిని తమ ముందు ప్రవేశపెట్టాలని ఖాప్ పంచాయతీ ఆదేశాలు జారీ చేసి బహిరంగంగా ఆమెకు శిక్ష వేశారు.

loader