న్యూఢిల్లీ: భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అత్యాచార ఘటనలకు కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు. 

ఇంటర్నేషల్ మీడియా సైతం భారతదేశంలో జరుగుతున్న రేప్ ల గురించి ప్రశ్నిస్తోందని రాహుల్ తెలిపారు. మహిళలపై అత్యాచారాలు, దారుణమైన ఘటనలపై బీజేపీ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందన్నారు. 

ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడ్డారని అతడిని శిక్షించకుండా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజాప్రతినిధులే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నా చర్యలు తీసుకోవాల్సిన ప్రధాని మోదీ మౌనంగా ఉంటున్నారంటూ విరుచుకుపడ్డారు. 

నేరస్థులను తమకు అనుచరులుగా మార్చుకుంటున్న బీజేపీ వైఖరి సిగ్గుగా ఉందన్నారు. ఇకపోతే ఉన్నావ్ బాధితురాలి రేప్, హత్యాయత్నం ఘటనపై కూడా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

యూపీలో మహిళలపై అఘాయిత్యాలకు అంతేలేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం చోద్యం చూస్తుండటంతో అక్కడ దారుణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అత్యాచారారాలపై కఠిన చర్యలు తీసుకువస్తేనే గానీ ఇలాంటి ఘటనలు నిర్మూలించలేమన్నారు. అయితే బీజేపీ అందుకు సిద్ధంగా లేకపోవడం బాధాకరమన్నారు రాహుల్ గాంధీ.