Asianet News TeluguAsianet News Telugu

చిరాగ్ పాశ్వాన్ కజిన్ ప్రిన్స్ రాజ్ మీద రేప్ కేసు... ! ఎఫ్ఐఆర్ నమోదు !!

బీహార్‌, సమస్తిపూర్ ఎంపీ ప్రిన్స్ రాజ్ తనపై మూడు నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తరువాత బెదిరించాడని ఎల్‌జెపి కార్యకర్త అయిన ఆ మహిళ ఢిల్లీలోని కానాట్ ప్లేస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Rape Case Filed Against Chirag Paswan's Cousin, An MP
Author
Hyderabad, First Published Sep 14, 2021, 12:48 PM IST

న్యూఢిల్లీ : చిరాగ్ పాశ్వాన్ కజిన్, లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి) ఎంపి ప్రిన్స్ రాజ్ అత్యాచారం కేసు నమోదయ్యింది. ఓ మహిళ ప్రిన్స్ రాజ్ తనమీద అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో ఢిల్లీలో అతని మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యింది. 

బీహార్‌, సమస్తిపూర్ ఎంపీ ప్రిన్స్ రాజ్ తనపై మూడు నెలల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ తరువాత బెదిరించాడని ఎల్‌జెపి కార్యకర్త అయిన ఆ మహిళ ఢిల్లీలోని కానాట్ ప్లేస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మూడునెలల క్రితపు ఈ కేసు మీద ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 9 న విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు ఈ కేసులో నివేదికను దాఖలు చేశారు.

దీనిమీద జూన్ 17 న, ప్రిన్స్ రాజ్ ఓ ట్వీట్ చేశాడు. వేధింపులు, అత్యాచారం, బెదిరింపులు అంటూ  "ఒక మహిళ నా పరువుకు భంగం కలిగేలా ప్రకటనలు చేస్తుంది" అంటూ ఆరోపణలను ఖండిస్తూ ఒక ట్వీట్ చేశారు.

అందులో "నాకు వ్యతిరేకంగా చేసిన అటువంటి ఫిర్యాదు లేదా వాదనను నేను ఖండిస్తున్నాను. అవన్నీ పచ్చి అబద్ధాలు, కల్పితాలు,  నా ప్రతిష్టకు భంగం కలిగించడం ద్వారా నన్ను వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒత్తిడికి గురి చేసే పెద్ద కుట్రలో భాగం ఈ ఆరోపణ" అని ఎంపీ ట్వీట్ లో పేర్కొన్నాడు.

వివాహితతో అక్రమ సంబంధం.. యువకుడిని సుత్తితో కొట్టి..!

"మన దేశంలో మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలను దుర్వినియోగం చేయడానికి.. ఇలా వాడడాన్ని, ఈ దుర్మార్గపు ప్రయత్నాలకు నేను చాలా బాధపడుతున్నాను" అని ఆయన అన్నారు.

ఆ మహిళ గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేసిందని, ఫిబ్రవరిలో తాను ఆమెపై ఫిర్యాదు చేశానని ఆయన ప్రత్యారోపణ చేశారు. తన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.

ఈ ఏడాది ప్రారంభంలో చిరాగ్ పాశ్వాన్ తన కజిన్‌తో విడిపోయారు. పాశ్వాన్ మామ ఎల్‌జెపి నుంచి విడిపోయారు. లోక్‌సభలో ఆరుగురు ఎల్‌జెపి ఎంపీలలో ఐదుగురు అతని పక్షం వహించారు. తిరుగుబాటు చేసిన ఐదుగురిలో ప్రిన్స్ రాజ్ కూడా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios