జైపూర్: వరుసకు చెల్లెలు అయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అంతేకాదు ఈ దారుణానికి భార్య,తండ్రి కూడ సహకరించారు. అంతేకాదు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడే దృశ్యాలను రికార్డు చేశారు. అంతేకాదు  ఈ దృశ్యాలను పోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తానని బాధితురాలిని బెదిరించేవాడు. దీంతో బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీగంగానగర్‌లో నివాసం ఉండే తారారాం వ్యక్తి వరుసకు సోదరయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. తరచూ ఈ బాలికపై రేప్ చేసేవాడు. నిందితుడికి అతడి భార్య , తండ్రి సహకరించారు.  ఈ విషయం ఎవరికైనా చెబితే ఈ వీడియోలను పోర్న్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తామని బాదితురాలిని బెదిరింపులకు పాల్పడ్డాడు. 

ఈ వేధింపులు భరించలేక బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.  దీంతో బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె కోలుకొంటుంది. 

ఈ ఘటన జరిగి నెల రోజులు దాటినా కూడ నిందితులపై చర్యలు తీసుకోకపోవడంపై బాధిత కుటుంబం పోలీసుల తీరును తప్పుబడుతోంది. నిందితులను అరస్ట్ చేసి  కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.