రాజస్థాన్‌ను ‘‘చే’’ జిక్కించుకున్న కాంగ్రెస్.. కాబోయే సీఎం అశోక్ గెహ్లాట్..?

rajasthan assembly election votes counting live updates

7:21 PM IST

వసుంధర ఓటమికి కారణం స్వయంకృతమేనా..?

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న రాజస్థాన్‌ను ఆ పార్టీ కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి వసుంధరా రాజేయేనని అందురు ఒప్పుకునే మాట. తన మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పకూడదన్న ఆమె మాట..చివరికి రాజేను ఓటమి బాట పట్టించింది.

రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో వసుంధర ప్రభుత్వం విఫలమైంది. రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరసనలకు దిగిన రైతన్నలను అరెస్ట్ చేయించడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అలాగే శాంతిభద్రతలను వసుంధర ఏ మాత్రం పట్టించుకోలేదు.. గో సంరక్షకుల పేరిట అమాయకులపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై అత్యాచారాల రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఇక బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచిన మధ్య తరగతి ఓటర్లు ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది.

అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 5 వేల నిరుద్యోగ భృతి అమలు చేస్తామని, ప్రభుత్వ రంగంలో 30 వేల ఉద్యోగాలిస్తామన్న రాజే.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో యువత నమ్మకాన్ని కోల్పోయిన రాజే వారి ఆగ్రహానికి గురయ్యారు.

ఇక అన్నింటికి మించి ‘‘ మహారాణి కోటలోనే కూర్చొంటారు.. అక్కడి నుంచి పరిపాలిస్తారు.. ప్రజలతో మమేకం కావడం లేదన్న ఆరోపణ జనంలోకి బాగా వెళ్లింది. కేవలం ఎన్నికల సమయంలోనే ఆమె ప్రజల వద్దకు వెళుతున్నారంటూ కాంగ్రెస్ చేసిన విమర్శ పనిచేసింది.

టిక్కెట్ల కేటాయింపుతో పాటు అనేక కీలకాంశాలలో ముఖ్యమంత్రి వసుంధరా రాజే మాటకు అధిష్టానం అధిక విలువనిచ్చింది. టిక్కెట్ల విషయంలో సిట్టింగులకు కాకుండా ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలకు టిక్కెట్లు కేటాయించడంతో చాలా మంది రాజేకు వ్యతిరేకంగా పనిచేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అలాగే రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ సఫలమయ్యారు. యువతతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్రచారం చేయడంలో సచిన్ పైలెట్ విజయం సాధించారరు. కాంగ్రెస్‌ను గెలుపుబాట పట్టించడానికి వీరిద్దరూ తీవ్రంగా కృషి చేశారు.

వీరి ముందు రాజే ఛరిష్మా పనిచేయలేదు. వీరికి ధీటుగా తన పాలన గురించి, పథకాల గురించి వసుంధర ప్రచారం చేసుకోలేకపోయారు. ఇక సామాజికవర్గ సమీకరణాల్లోనూ రాజే లెక్కలు తప్పాయి. అలాగే 1998 నుంచి నేటి వరకు రాజస్థాన్ ప్రజలు ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారాన్ని కట్టబెట్టలేదు.

ఓసారి కాంగ్రెస్‌కు, మరోసారి బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తూ వచ్చారు. అదే సెంటిమెంట్ మళ్లీ రీపిట్ అయ్యింది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి దిగ్గజాలు ప్రచారం చేసినా వసుంధరకు విజయాన్ని అందించలేకపోయారు. 

6:31 PM IST

రేపు సీఎల్పీ మీటింగ్...సీఎం అభ్యర్థిపై చర్చ

రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారాన్ని అందుకుంది. ఈ క్రమంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అన్న పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.

సీఎం రేసులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేత కేసీ. వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. 
 
KC Venugopal, Congress: Tomorrow morning there‘ll be a CLP meeting after that we will seek views of MLAs and senior leaders then we will apprise the situation to Congress President. As per party customs president will take the final decision on the leadership issue. #Rajasthan pic.twitter.com/UL5moFoGU4

— ANI (@ANI) December 11, 2018

5:59 PM IST

సచిన్‌ను సీఎంను చేసిన వికీపీడియా

రాజస్థాన్ ఎన్నికల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ దిశగా కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

దీంతో నెటిజన్లు గూగుల్‌ను విపరీతంగా జల్లెడ పడుతున్నారు. సీఎం రేసులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే సచిన్ పైలట్‌ను సీఎంను చేసేసింది వికీపీడియా.

సచిన్ పైలట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆయన్ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చూపించింది. అయితే నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వెంటనే తప్పు తెలుసుకుని దానిని తొలగించింది.

ఈ ఎన్నికల్లో టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సచిన్ పైలట్..రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్‌పై 51,179 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 

5:28 PM IST

కాబోయే సీఎం అశోక్ గెహ్లాట్..?

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారానికి దగ్గరైంది. తొలుత హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు.

మేజిక్ ఫిగర్ లభించని పక్షంలో అవసరమైతే స్వతంత్రులతో జట్టుకట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు మొదలుపెట్టారు. అయితే తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు దగ్గరవ్వడంతో కాబోయే ముఖ్యమంత్రి ఎవరా అని పార్టీలో చర్చ జరుగుతోంది.

సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య సీఎం కుర్చీ కోసం పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రెబల్స్‌గా పోటీ చేసిన వారిలో తొమ్మిది మంది వరకు అశోక్ వర్గం వారే ఉన్నారు. వారిని కాంగ్రెస్ వైపుకు మరల్చిన పక్షంలో హైకమాండ్ ఆయన్నే ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందిని విశ్లేషకులు భావిస్తున్నారు. 

5:01 PM IST

కాంగ్రెస్‌కు మద్ధతు ప్రకటించిన ఆర్ఎల్‌డీ

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు. మేజిక్ ఫిగర్ లభించని పక్షంలో అవసరమైతే స్వతంత్రులతో జట్టుకట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు మొదలుపెట్టారు. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన తమ పార్టీ అభ్యర్ధి కాంగ్రెస్‌కు అండగా ఉంటారని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అజిత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

National Vice President of the Rashtriya Lok Dal (RLD) Jayant Chaudhary issues a letter, states "Respecting the mandate of the people, party President Chaudhary Ajit Singh has directed the MLA of the party to help Congress form a stable govt." #RajasthanElections . pic.twitter.com/4fPDujT4Nc

— ANI (@ANI) December 11, 2018

4:38 PM IST

రాజస్థాన్ సిఎం సీటుపై గెహ్లాట్ స్పందన

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. అయితే సీఎం అభ్యర్థి ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తమ ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారమే సిఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్  పార్లమెంటరి పార్టీ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూమంపై చర్చించనున్నట్లు  గెహ్లాట్ వెల్లడించారు.
 
3:38 PM IST

రాజస్థాన్ సిఎం అభ్యర్థులందరూ గెలుపు....

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్థులుగా ప్రచారంలో వున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సచిన్ ఫైలట్ ఇద్దరు భారీ మెజారిటీలతో గెలుపొందారు. బిజెపి సిఎం వసుంధర రాజే కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.
సచిన్ ఫైలట్ - టోంక్ - 50 వేల మెజారిటీ
అశోక్ గెహ్లాట్ - సర్దార్ పూర్ - 30 వేల మెజారిటీ
వసుంధరా రాజే - జలరపటాన్ - 45 వేల మెజారిటీ

1:32 PM IST

గెలిచిన రెబల్స్‌లో 9 మంది అశోక్ వర్గం వారే

రాజస్థాన్ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు సమాన స్థాయిలో నిలవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వీరి మద్ధతు అవసరం.

దీంతో ఇండిపెండెంట్లను తమవైపుకు తిప్పుకోవడానికి అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. గెలిచిన 12 మందిలో 9 మంది అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన వారే కావడంతో వారితో ఆయన చర్చలు జరుపుతున్నారు. 

1:25 PM IST

మేవార్‌లో కాంగ్రెస్ కొంప ముంచిన సమన్వయ లోపం

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఉదయం కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచినప్పటికీ.. తుది ఫలితం నాటికి కాంగ్రెస్, బీజేపీ సమాన స్థాయిలో నిలిచాయి.

బీజేపీకి పట్టున్న మేవార్, ఉదయ్‌పూర్ ప్రాంతాల్లోని బలంగా ఉన్న కొన్ని తెగలను కాంగ్రెస్ వైపు మళ్లీంచడంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లు విఫలమయ్యారు. వీరిద్దరి మధ్య సమన్వయం లోపించడంతో ఆ ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.
 
1:16 PM IST

లైవ్: రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: హంగ్ కు అవకాశం...స్వతంత్రులే కీలకం

రాజస్థాన్ లో ఫోటీ హోరా హోరీగా మారుతుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చినా...ప్రస్తుతం పోటీ నువ్వా...నేనా అన్నట్లు సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బిజెపి 86 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా కనిపిస్తోంది. ఇక 22 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్న ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కీలకంగా మారనున్నారు.   

12:53 AM IST

ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు...స్వతంత్రులతో సచిన్ మంతనాలు

రాజస్థాన్ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన  మెజారిటీ ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ గతంతో పోల్చుుకుంటే భారీగా సీట్లను, ఓట్లను పెంచుకుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ముందస్తుగానే ఆ పార్టీ నాయకత్వం అప్రమత్తమయ్యింది. గెలిచే స్థితిలో వున్న ఏడుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో సచిన్ ఫైలట్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

12:44 PM IST

రాజస్థాన్‌లో ఇండిపెండెంట్ల హవా

రాజస్థాన్ ఎన్నికల్లో స్వతంత్రులు దూసుకెళ్తున్నారు. ఉదయం నుంచి ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ ఇండిపెండెంట్లు ఆధిపత్యం కనబరుస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 80, కాంగ్రెస్ 95, ఇతరులు 24 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
 
12:22 AM IST

రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు...అశోక్ గెహ్లాట్ స్పందన

రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం అనివార్యంగా మారిందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. తమ సీట్ల సంఖ్య తగ్గినా, పెరిగినా తమకిక చింత లేదని...ప్రజలు తమ తరపున ఉన్నారని స్ఫష్టమైందని తెలిపారు. తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర బిజెపియేతర పార్టీలు తమకే మద్దతిస్తాయని గెహ్లాట్ ఆశాభావం వ్యక్తం చేశారు.   

Ashok Gehlot, Congress on #RajasthanElections results: Congress has won the mandate. No.s can go up & down but public's mandate is in the favour of Congress. We will get clear majority, still we would want independent candidates & parties other than BJP to support us if they want pic.twitter.com/BOuqebSkJk

— ANI (@ANI) December 11, 2018

11:58 AM IST

లైవ్: రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: మెళ్లిమెళ్లిగా పుంజుకుంటున్న బిజెపి

సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అందుకున్నారని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ ఫైలట్ గుర్తుచేశారు. అందువల్ల మూడు రాష్ట్రాల్లో (రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్) విజయం సాధించడం ద్వారా అధికారంలోకి వస్తామని....ఈ విజయాన్ని రాహుల్ కు బహుమతిగా ఇస్తామని సచిన్ ఫైలట్ గుర్తుచేశారు.  

Sachin Pilot,Congress: Rahul Gandhi became party president exactly a year ago this day, so this result is a gift for him. Congress will form Govt in three states #AssemblyElection2018 pic.twitter.com/WwDL5tgP0o

— ANI (@ANI) December 11, 2018

11:39 AM IST

లైవ్: రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు:మెళ్లిమెళ్లిగా పుంజుకుంటున్న బిజెపి

రాజస్థాన్ ఎన్నికల్లో బిజెపి పార్టీ మెళ్లిమెళ్లిగా పుంజుకుంటోంది. ఇప్నటివరకు కాంగ్రెస్, బిజెపిల మధ్య చాలా అంతరం కనిపించింది. అయితే తాజాగా కాంగ్రెస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం బిజెపి 83  స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఆధిక్యం 92 కు పడిపోయింది. ఇతరులు 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

11:35 AM IST

మూడు రాష్ట్రాల్లో అధికారం మాదే: సచిన్ పైలట్

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.

Sachin Pilot,Congress: Rahul Gandhi became party president exactly a year ago this day, so this result is a gift for him. Congress will form Govt in three states #AssemblyElection2018 pic.twitter.com/WwDL5tgP0o

— ANI (@ANI) December 11, 2018

11:21 AM IST

ఆధిక్యంలో కాంగ్రెస్.. ఆలయంలో వసుంధరా రాజే పూజలు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారం దిశగా దూసుకెళ్తోంది..

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రత్యేక పూజలు చేపట్టారు. జైపూర్‌లో 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఓట్ల లెక్కింపు రోజున సందర్శించడం ఆమెకు ఆనవాయితీ. ఎన్నికలు పూర్తిగా వెల్లడయ్యే వరకు ముఖ్యమంత్రి ఆలయంలోనే ఉంటారు.
 
11:18 AM IST

లైవ్: రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: బోసిపోతున్న బిజెపి రాష్ట్ర కార్యాలయం

రాజస్థాన్ లో బిజెపి పార్టీ కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. ఇప్పటివరకు భారీగా వెనుకంజలో వున్న బిజెపి కాస్త మెరుగుపడింది. ప్రస్తుతం కాంగ్రెస్ 106 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా బిజెపి 86 స్థానాల్లో ఆధిక్యంలోకి కొనసాగుతోంది.  

10:41 AM IST

లైవ్: రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: సచిన్ ఫైలట్ ఇంటివద్ద సంబరాలు

రాజస్థాన్ లో బిజెపి సీఎం అభ్యర్థి వసుంధరా రాజే కాంగ్రెస్ అభ్యర్థులు అశోక్ గెహ్లాట్, సచిన్ ఫైలట్ ల లిడింగ్ వివరాలు

Official ECI trends: Rajasthan CM Vasundhara Raje leading by 8845 votes from Jhalrapatan, Congress' Ashok Gehlot leading by 5112 votes from Sardarpura, Congress' Sachin Pilot leading by 5295 votes from Tonk. #AssemblyElections2018 pic.twitter.com/6LFgB3q3HB

— ANI (@ANI) December 11, 2018

10:37 AM IST

లైవ్: రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: సచిన్ ఫైలట్ ఇంటివద్ద సంబరాలు

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది. ఆ పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగగా, బిజెపి 84, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.   

10:12 AM IST

రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: సచిన్ ఫైలట్ ఇంటివద్ద సంబరాలు

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్దమయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ ఫైలట్ ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  టోంకో నియోజకవర్గం నుండి ఫోటీ చేసిన సచిన్ కూడా ముందంజలో కొనసాగుతున్నారు

12:00 AM IST

లైవ్: రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు: బోసిపోతున్న బిజెపి రాష్ట్ర కార్యాలయం

రాజస్థాన్ లో అధికారాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తేలా కనిపించడంతో రాజధాని జైపూర్ లోని పార్టీ కార్యాలయం బోసిపోతోంది. నాయకులు, కార్యకర్తలు అసలు ఆ దరిదాపుల్లో కనిపించడం లేదు. కేవలం కొంతమంది మీడియా సభ్యులు మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు.

ప్రస్తుతం బిజెపి పార్టీ కార్యాలయం వద్ద పరిస్థితి  (ఫోటోలు)

7:22 PM IST:

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న రాజస్థాన్‌ను ఆ పార్టీ కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి వసుంధరా రాజేయేనని అందురు ఒప్పుకునే మాట. తన మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పకూడదన్న ఆమె మాట..చివరికి రాజేను ఓటమి బాట పట్టించింది.

రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో వసుంధర ప్రభుత్వం విఫలమైంది. రైతు ఆత్మహత్యలు పెరిగిపోవడంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరసనలకు దిగిన రైతన్నలను అరెస్ట్ చేయించడంతో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అలాగే శాంతిభద్రతలను వసుంధర ఏ మాత్రం పట్టించుకోలేదు.. గో సంరక్షకుల పేరిట అమాయకులపై దాడులు పెరిగిపోయాయి. మహిళలపై అత్యాచారాల రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. ఇక బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచిన మధ్య తరగతి ఓటర్లు ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది.

అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 5 వేల నిరుద్యోగ భృతి అమలు చేస్తామని, ప్రభుత్వ రంగంలో 30 వేల ఉద్యోగాలిస్తామన్న రాజే.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో యువత నమ్మకాన్ని కోల్పోయిన రాజే వారి ఆగ్రహానికి గురయ్యారు.

ఇక అన్నింటికి మించి ‘‘ మహారాణి కోటలోనే కూర్చొంటారు.. అక్కడి నుంచి పరిపాలిస్తారు.. ప్రజలతో మమేకం కావడం లేదన్న ఆరోపణ జనంలోకి బాగా వెళ్లింది. కేవలం ఎన్నికల సమయంలోనే ఆమె ప్రజల వద్దకు వెళుతున్నారంటూ కాంగ్రెస్ చేసిన విమర్శ పనిచేసింది.

టిక్కెట్ల కేటాయింపుతో పాటు అనేక కీలకాంశాలలో ముఖ్యమంత్రి వసుంధరా రాజే మాటకు అధిష్టానం అధిక విలువనిచ్చింది. టిక్కెట్ల విషయంలో సిట్టింగులకు కాకుండా ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలకు టిక్కెట్లు కేటాయించడంతో చాలా మంది రాజేకు వ్యతిరేకంగా పనిచేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అలాగే రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ సఫలమయ్యారు. యువతతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్రచారం చేయడంలో సచిన్ పైలెట్ విజయం సాధించారరు. కాంగ్రెస్‌ను గెలుపుబాట పట్టించడానికి వీరిద్దరూ తీవ్రంగా కృషి చేశారు.

వీరి ముందు రాజే ఛరిష్మా పనిచేయలేదు. వీరికి ధీటుగా తన పాలన గురించి, పథకాల గురించి వసుంధర ప్రచారం చేసుకోలేకపోయారు. ఇక సామాజికవర్గ సమీకరణాల్లోనూ రాజే లెక్కలు తప్పాయి. అలాగే 1998 నుంచి నేటి వరకు రాజస్థాన్ ప్రజలు ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికారాన్ని కట్టబెట్టలేదు.

ఓసారి కాంగ్రెస్‌కు, మరోసారి బీజేపీకి అధికారాన్ని అప్పగిస్తూ వచ్చారు. అదే సెంటిమెంట్ మళ్లీ రీపిట్ అయ్యింది. ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాంటి దిగ్గజాలు ప్రచారం చేసినా వసుంధరకు విజయాన్ని అందించలేకపోయారు. 

6:32 PM IST:

రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారాన్ని అందుకుంది. ఈ క్రమంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అన్న పార్టీ శ్రేణుల్లో చర్చ మొదలైంది.

సీఎం రేసులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని ఆ పార్టీ నేత కేసీ. వేణుగోపాల్ తెలిపారు. ఈ సమావేశంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న దానిపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. 
 
KC Venugopal, Congress: Tomorrow morning there‘ll be a CLP meeting after that we will seek views of MLAs and senior leaders then we will apprise the situation to Congress President. As per party customs president will take the final decision on the leadership issue. #Rajasthan pic.twitter.com/UL5moFoGU4

— ANI (@ANI) December 11, 2018

5:59 PM IST:

రాజస్థాన్ ఎన్నికల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ దిశగా కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.

దీంతో నెటిజన్లు గూగుల్‌ను విపరీతంగా జల్లెడ పడుతున్నారు. సీఎం రేసులో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడకుండానే సచిన్ పైలట్‌ను సీఎంను చేసేసింది వికీపీడియా.

సచిన్ పైలట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఆయన్ను రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చూపించింది. అయితే నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో వెంటనే తప్పు తెలుసుకుని దానిని తొలగించింది.

ఈ ఎన్నికల్లో టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సచిన్ పైలట్..రవాణా శాఖ మంత్రి యూనస్ ఖాన్‌పై 51,179 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 

5:29 PM IST:

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారానికి దగ్గరైంది. తొలుత హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు.

మేజిక్ ఫిగర్ లభించని పక్షంలో అవసరమైతే స్వతంత్రులతో జట్టుకట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు మొదలుపెట్టారు. అయితే తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‌కు దగ్గరవ్వడంతో కాబోయే ముఖ్యమంత్రి ఎవరా అని పార్టీలో చర్చ జరుగుతోంది.

సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య సీఎం కుర్చీ కోసం పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రెబల్స్‌గా పోటీ చేసిన వారిలో తొమ్మిది మంది వరకు అశోక్ వర్గం వారే ఉన్నారు. వారిని కాంగ్రెస్ వైపుకు మరల్చిన పక్షంలో హైకమాండ్ ఆయన్నే ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉందిని విశ్లేషకులు భావిస్తున్నారు. 

5:02 PM IST:

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అందివచ్చే ఏ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకోవడం లేదు. మేజిక్ ఫిగర్ లభించని పక్షంలో అవసరమైతే స్వతంత్రులతో జట్టుకట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు మొదలుపెట్టారు. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన తమ పార్టీ అభ్యర్ధి కాంగ్రెస్‌కు అండగా ఉంటారని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్‌డీ) ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అజిత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

National Vice President of the Rashtriya Lok Dal (RLD) Jayant Chaudhary issues a letter, states "Respecting the mandate of the people, party President Chaudhary Ajit Singh has directed the MLA of the party to help Congress form a stable govt." #RajasthanElections . pic.twitter.com/4fPDujT4Nc

— ANI (@ANI) December 11, 2018

4:37 PM IST:

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాజీ సిఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. అయితే సీఎం అభ్యర్థి ఎవరనేది మాత్రం అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తమ ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారమే సిఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్  పార్లమెంటరి పార్టీ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూమంపై చర్చించనున్నట్లు  గెహ్లాట్ వెల్లడించారు.
 
3:37 PM IST:

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్థులుగా ప్రచారంలో వున్న మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సచిన్ ఫైలట్ ఇద్దరు భారీ మెజారిటీలతో గెలుపొందారు. బిజెపి సిఎం వసుంధర రాజే కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.
సచిన్ ఫైలట్ - టోంక్ - 50 వేల మెజారిటీ
అశోక్ గెహ్లాట్ - సర్దార్ పూర్ - 30 వేల మెజారిటీ
వసుంధరా రాజే - జలరపటాన్ - 45 వేల మెజారిటీ

1:32 PM IST:

రాజస్థాన్ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు సమాన స్థాయిలో నిలవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే వీరి మద్ధతు అవసరం.

దీంతో ఇండిపెండెంట్లను తమవైపుకు తిప్పుకోవడానికి అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. గెలిచిన 12 మందిలో 9 మంది అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన వారే కావడంతో వారితో ఆయన చర్చలు జరుపుతున్నారు. 

1:26 PM IST:

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ఉదయం కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచినప్పటికీ.. తుది ఫలితం నాటికి కాంగ్రెస్, బీజేపీ సమాన స్థాయిలో నిలిచాయి.

బీజేపీకి పట్టున్న మేవార్, ఉదయ్‌పూర్ ప్రాంతాల్లోని బలంగా ఉన్న కొన్ని తెగలను కాంగ్రెస్ వైపు మళ్లీంచడంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లు విఫలమయ్యారు. వీరిద్దరి మధ్య సమన్వయం లోపించడంతో ఆ ప్రాంతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.
 
1:15 PM IST:

రాజస్థాన్ లో ఫోటీ హోరా హోరీగా మారుతుంది. మొదట్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చినా...ప్రస్తుతం పోటీ నువ్వా...నేనా అన్నట్లు సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ 92 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బిజెపి 86 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా కనిపిస్తోంది. ఇక 22 స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్న ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కీలకంగా మారనున్నారు.   

12:57 PM IST:

రాజస్థాన్ ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన  మెజారిటీ ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ గతంతో పోల్చుుకుంటే భారీగా సీట్లను, ఓట్లను పెంచుకుంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ముందస్తుగానే ఆ పార్టీ నాయకత్వం అప్రమత్తమయ్యింది. గెలిచే స్థితిలో వున్న ఏడుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతో సచిన్ ఫైలట్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.

12:45 PM IST:

రాజస్థాన్ ఎన్నికల్లో స్వతంత్రులు దూసుకెళ్తున్నారు. ఉదయం నుంచి ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ ఇండిపెండెంట్లు ఆధిపత్యం కనబరుస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ 80, కాంగ్రెస్ 95, ఇతరులు 24 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
 
12:25 PM IST:

రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం అనివార్యంగా మారిందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. తమ సీట్ల సంఖ్య తగ్గినా, పెరిగినా తమకిక చింత లేదని...ప్రజలు తమ తరపున ఉన్నారని స్ఫష్టమైందని తెలిపారు. తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర బిజెపియేతర పార్టీలు తమకే మద్దతిస్తాయని గెహ్లాట్ ఆశాభావం వ్యక్తం చేశారు.   

Ashok Gehlot, Congress on #RajasthanElections results: Congress has won the mandate. No.s can go up & down but public's mandate is in the favour of Congress. We will get clear majority, still we would want independent candidates & parties other than BJP to support us if they want pic.twitter.com/BOuqebSkJk

— ANI (@ANI) December 11, 2018

11:58 AM IST:

సరిగ్గా ఏడాది క్రితం రాహుల్ గాంధీ ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అందుకున్నారని రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ ఫైలట్ గుర్తుచేశారు. అందువల్ల మూడు రాష్ట్రాల్లో (రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్) విజయం సాధించడం ద్వారా అధికారంలోకి వస్తామని....ఈ విజయాన్ని రాహుల్ కు బహుమతిగా ఇస్తామని సచిన్ ఫైలట్ గుర్తుచేశారు.  

Sachin Pilot,Congress: Rahul Gandhi became party president exactly a year ago this day, so this result is a gift for him. Congress will form Govt in three states #AssemblyElection2018 pic.twitter.com/WwDL5tgP0o

— ANI (@ANI) December 11, 2018

12:11 PM IST:

రాజస్థాన్ ఎన్నికల్లో బిజెపి పార్టీ మెళ్లిమెళ్లిగా పుంజుకుంటోంది. ఇప్నటివరకు కాంగ్రెస్, బిజెపిల మధ్య చాలా అంతరం కనిపించింది. అయితే తాజాగా కాంగ్రెస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం బిజెపి 83  స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఆధిక్యం 92 కు పడిపోయింది. ఇతరులు 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 

11:38 AM IST:

ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు.

Sachin Pilot,Congress: Rahul Gandhi became party president exactly a year ago this day, so this result is a gift for him. Congress will form Govt in three states #AssemblyElection2018 pic.twitter.com/WwDL5tgP0o

— ANI (@ANI) December 11, 2018

11:21 AM IST:

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారం దిశగా దూసుకెళ్తోంది..

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రత్యేక పూజలు చేపట్టారు. జైపూర్‌లో 700 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని ఓట్ల లెక్కింపు రోజున సందర్శించడం ఆమెకు ఆనవాయితీ. ఎన్నికలు పూర్తిగా వెల్లడయ్యే వరకు ముఖ్యమంత్రి ఆలయంలోనే ఉంటారు.
 
11:25 AM IST:

రాజస్థాన్ లో బిజెపి పార్టీ కొద్దికొద్దిగా పుంజుకుంటోంది. ఇప్పటివరకు భారీగా వెనుకంజలో వున్న బిజెపి కాస్త మెరుగుపడింది. ప్రస్తుతం కాంగ్రెస్ 106 స్థానాల్లో ఆధిక్యం కనబర్చగా బిజెపి 86 స్థానాల్లో ఆధిక్యంలోకి కొనసాగుతోంది.  

10:43 AM IST:

రాజస్థాన్ లో బిజెపి సీఎం అభ్యర్థి వసుంధరా రాజే కాంగ్రెస్ అభ్యర్థులు అశోక్ గెహ్లాట్, సచిన్ ఫైలట్ ల లిడింగ్ వివరాలు

Official ECI trends: Rajasthan CM Vasundhara Raje leading by 8845 votes from Jhalrapatan, Congress' Ashok Gehlot leading by 5112 votes from Sardarpura, Congress' Sachin Pilot leading by 5295 votes from Tonk. #AssemblyElections2018 pic.twitter.com/6LFgB3q3HB

— ANI (@ANI) December 11, 2018

10:36 AM IST:

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతోంది. ఆ పార్టీ 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగగా, బిజెపి 84, ఇతరులు 1 స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నాయి.   

10:27 AM IST:

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్దమయ్యారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ ఫైలట్ ఇంటి వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.  టోంకో నియోజకవర్గం నుండి ఫోటీ చేసిన సచిన్ కూడా ముందంజలో కొనసాగుతున్నారు

11:01 AM IST:

రాజస్థాన్ లో అధికారాన్ని కోల్పోయే పరిస్థితి తలెత్తేలా కనిపించడంతో రాజధాని జైపూర్ లోని పార్టీ కార్యాలయం బోసిపోతోంది. నాయకులు, కార్యకర్తలు అసలు ఆ దరిదాపుల్లో కనిపించడం లేదు. కేవలం కొంతమంది మీడియా సభ్యులు మాత్రమే అక్కడ కనిపిస్తున్నారు.

ప్రస్తుతం బిజెపి పార్టీ కార్యాలయం వద్ద పరిస్థితి  (ఫోటోలు)

ఈ నెల 7వ తేదీన రాజస్థాన్ లోని 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలుడవడుతున్నాయి.