Asianet News TeluguAsianet News Telugu

రాజ్ కుంద్రా : పోర్న్ vs వ్యభిచారం.. పాత ట్వీట్ వైరల్..

మార్చి 29, 2012న రాజ్ కుంద్రా తన ట్విటర్ వేదికగా ‘పోర్స్ వర్సెస్ వ్యభిచారం.. కొంతమందికి డబ్బులు చెల్లించి కెమెరా ముందు శృంగారం చేయడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు. వ్యభిచారానికి దీనికీ ఏమైనా వ్యత్యాసం ఉందా’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం అప్పట్లో కాస్త వివాదం అయింది. 

Raj Kundra's old tweet on 'porn vs prostitution' goes viral after his arrest - bsb
Author
Hyderabad, First Published Jul 20, 2021, 4:21 PM IST

ఢిల్లీ : అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్ ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారన్న ఆరోపణలపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలో రాజ్ కుంద్రా చేసిన ఒక వివాదాస్పద ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 

మార్చి 29, 2012న రాజ్ కుంద్రా తన ట్విటర్ వేదికగా ‘పోర్స్ వర్సెస్ వ్యభిచారం.. కొంతమందికి డబ్బులు చెల్లించి కెమెరా ముందు శృంగారం చేయడాన్ని ఎందుకు చట్టబద్ధం చేయకూడదు. వ్యభిచారానికి దీనికీ ఏమైనా వ్యత్యాసం ఉందా’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేయడం అప్పట్లో కాస్త వివాదం అయింది. 

రాజ్ కుద్రాకి ఆదాయం ఎలా వస్తుంది..? పాత వీడియో వైరల్

అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాలు 2012లో లేకపోవడం, ఇప్పుడు అశ్లీల చిత్రాల ఆరోపణలమీద రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. రాజ్ కుంద్రా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

మరోవైపు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్ కుంద్రా కనిపిస్తున్నాడని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు జులై 23వ తేదీ వరకూ రాజ్ కుంద్రాను తమ కస్టడీలోనే ఉంచనున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. కాగా, తాను ఏ తప్పు చేయలేదని రాజ్ కుంద్రా పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios