షేర్ మార్కెట్ లో రాహుల్ గాంధీ పెట్టుబడులు... ఐదు నెలలకే అంత లాభమా..?
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను పొందుతున్నారు. గత ఐదు నెలల్లో ఆయన షేర్ల విలువ ఎంత పెరిగిందో తెలుసా?
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు పొందారు. కేవల ఐదు నెలల్లోనే ఆయన రూ.46 లక్షలకు పైగా సంపాదించారు. ఆయన ఏ కంపనీ షేర్లను కొనుగోలు చేసి ఎంత సంపాదించారో లెక్కలతో సహా బైటపెట్టింది ఐఎఎన్ఎస్.
వివిధ కంపనీల్లో రాహుల్ గాంధీ కొనుగోలు చేసిన వివరాలను... ప్రస్తుతం షేర్ విలువ ఎంతుతో లెక్కగట్టారు. దీనిప్రకారం రాహుల్ ఇన్ఫోసిస్, టిసిఎస్, ఏషియన్ పేయింట్స్, దివిస్ ల్యాబోరేటరీస్, ఐసిఐసిఐ,నెస్లే, టైటాన్ వంటి అనేక కంపనీల్లో షేర్లు కొనుగోలు చేసారు. ఇలా గల ఐదునెలల క్రితం ఈ షేర్ల విలువ రూ.4,33,58,961 గా వుంది. ప్రస్తుతం ఈ విలువ రూ.4,80,08,667 కు చేరింది. అంటే ఐదు నెలల్లో రాహుల్ షేర్ల విలువ 46,49,706 రూపాలయకు చేరింది.
భారత ఆర్ధిక వృద్ది, స్టాక్ మార్కెట్లపై రాహుల్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాహుల్. మూడోసారి మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు... ఈ సమయంలో ఆయన షేర్ల లెక్కలు ఆసక్తికరంగా మారాయి. రాహుల్ గాంధీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం స్టాక్స్ విలువ ఎంతుంది? ఇప్పుడు అవే స్టాక్స్ విలువ ఎంత పెరిగింది? అనేది బయటకు వచ్చింది.