హమ్మయ్య.. రత్న భండార్ తాళాలు దొరికాయ్

puri jagannath ratna bhandar Keys Found
Highlights

హమ్మయ్య.. రత్న భండార్ తాళాలు దొరికాయ్

ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ దేవాలయానికి సంబంధించి స్వామి వారి ఆభరణాలు భద్రపరిచే రత్నభండార్ తాళాలు ఎట్టకేలకు దొరికాయి. వేల ఏళ్ల చరిత్ర కలిగిన పూరీ జగన్నాథ్ దేవస్థానంలో స్వామి వారికి ఎంతో మంది చక్రవర్తులు, మహారాజులు, జమీందారులు, భక్తులు విలువైన కానుకలను సమర్పిస్తూ వచచ్చారు. వాటిని ఆలయ అధికారులు దేవస్థానం కింద ఉన్న నేలమాళిగల్లాంటి గదుల్లో భద్రపరిచారు.. దీనినే రత్నభండార్ అని పిలుస్తారు.

వీటిలో లక్షల కోట్ల విలువైన వజ్ర, వైడూర్యాలు, బంగారు నాణాలు ఉన్నాయి. ఆలయ పునరుద్ధరుణ  పనుల్లో భాగంగా ఏప్రిల్ 4వ తేదిన రత్నభండార్ గది తలుపులు తీసేందుకు ప్రయత్నించగా తాళాలు కనిపించలేదు.. ఆలయ సిబ్బంది వద్ద కానీ.. జిల్లా కోశాధికారి కార్యాలయంలో కానీ తాళాలు కనిపించలేదు. దీంతో తాళాలు ఆదృశ్యమయ్యాయని అధికారులు ప్రకటించారు.. ఈ వార్తతో స్వామి వారి భక్తులతో పాటు సాంప్రదాయవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

జగన్నాథుని సంపద తస్కరించేందుకు కుట్ర జరగుతోందంటూ పలువురు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రత్నభండార్ తాళాలను వీలైనంత త్వరగా కనిపెట్టాలని  ఒడిషా ప్రభుత్వం పూరి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అప్పటి నుంచి జిల్లా ఖజానాలో అణువణువు గాలించారు అధికారులు.. అయితే నిన్న ఓ బ్రౌన్ కలర్ కవర్‌లో పాత తాళాలు దొరికాయని.. అవి రత్నభండార్ తాళాలేనని జిల్లా కలెక్టర్ తెలిపారు.  

loader