యువతికి వీడియో కాల్ చేసి హస్తప్రయోగం ... ఆప్ మంత్రి అశ్లీల వీడియో వైరల్
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ మాదిరిగానే పంజాబ్ కు చెందిన ఓ మంత్రి అశ్లీల వీడియో కాల్ రికార్డ్ బయటకు వచ్చింది...
న్యూడిల్లీ : ఇప్పటికే తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా పంజాబ్ కు చెందిన ఓ ఆప్ మంత్రి అశ్లీల వీడియో బయటకు వచ్చాయి. ఉద్యోగం కోసం ఆశ్రయించిన యువతిపై సదరు మంత్రి కన్నేసాడని... ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బిజెపి యువమోర్చా జాతీయ కార్యదర్శి తేజిందర్ భగ్గా ఆరోపించారు. అంతేకాదు పంజాబ్ మంత్రి అశ్లీల చేష్టలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. వెంటనే పంజాబ్ కేబినెట్ నుండి సదరు కీచక మంత్రిని తొలగించాలని ఆప్ ను డిమాండ్ చేసారు బిజెపి నేత.
అసలేం జరిగింది :
పంజాబ్ కు చెందిన ఓ 21 ఏళ్ల యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో వుంది. ఈ క్రమంలోనే ఆమె పంజాబ్ మంత్రి బల్కర్ సింగ్ ను ఆశ్రయించింది. అయితే సహాయం కోరి వచ్చిన యువతిపై మంత్రి కన్ను పడింది. ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న మంత్రి తరచూ ఫోన్ చేసి లైంగిక వేధింపులకు దిగేవాడు... తాజాగా మరింత బరితెగించిన ఆయన వీడియో కాల్ చేసి మరింత నీచంగా వ్యవహరించినట్లు బిజెపి నేత తెలిపారు. ప్యాంటు విప్పేసి హస్తప్రయోగం చేసుకుంటూ యువతిని వేధించిన సదరు మంత్రి వీడియోను తేజిందర్ భగ్గా బయటపెట్టారు.
పంజాబ్ మంత్రి బల్కర్ సింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యువతితో నీచంగా ప్రవర్తించిన మంత్రిపై నెటిజన్లు కూడా భగ్గుమంటున్నారు. సామాన్య ప్రజల పక్షానే ఆమ్ ఆద్మీ పార్టీ నిలుస్తుందని చెప్పే అరవింద్ కేజ్రీవాల్ ఓ మహిళతో నీచంగా ప్రవర్తించిన పంజాబ్ మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తమ మంత్రివర్గ సభ్యుడి నీచపు పనిపై వెంటనే స్పందించాలని కోరుతున్నారు. \
ఇక బిజెపి నేత తేజిందర్ భగ్గా అయితే మంత్రి వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. బరితెగించి అర్ధనగ్నంగా యువతికి వీడియోకాల్ చేసిన మంత్రి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వేధించాడని అన్నారు. అంతేకాదు యువతిని బెదిరిస్తూ బట్టలు విప్పేసి నగ్నంగా కనిపించాలని కోరాడట సదరు మంత్రి. అయితే మంత్రి వ్యవహారం మొత్తాన్ని రికార్డ్ చేసిన యువతి ధైర్యంగా బయటపెట్టిందని బిజెపి నేత తేజిందర్ భగ్గా తెలిపారు.
ఆప్ పై భగ్గుమంటున్న నెటిజన్లు :
పంజాబ్ మంత్రి వ్యవహారం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. పంజాబ్ మంత్రి లైంగిక వేధింపులపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇక ప్రజలు కూడా మంత్రి బల్కర్ సింగ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయనతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపైనా సోషల్ మీడియా వేదికన తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.