రాహుల్‌ను పెళ్లి చేసుకొంటా: సాధ్వి ప్రాచి సంచలనం

Prayed Rahul gets wife if Cong loses in 2019: Sadhvi Prachi at Gorakhnath temple
Highlights

సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సాధ్వి ప్రాచి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీకి భార్యను కావాలని కోరుకొంటున్నట్టు చెప్పారు.

లక్నో: సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సాధ్వి ప్రాచి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే  కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీకి భార్యను కావాలని కోరుకొంటున్నట్టు చెప్పారు.

మంగళవారం నాడు ఆమె  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకొన్నారు. ఆ తర్వాత ఆమె  మీడియాతో మాట్లాడారు.  ఎప్పుడూ కూడ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ  వార్తల్లో నిలుస్తుంటారు.  గోరఖ్‌నాథ్ ఆశీస్సుల కోసం  తాను వచ్చినట్టు ఆమె చెప్పారు. గోరఖ్‌నాథ్ ఆశీస్సుల కోసం తాను తప్పకుండా వస్తానని ఆమె చెప్పారు.

కానీ, ఈ సారి మాత్రం ప్రత్యేకమైన కోరికను కొరుకొన్నట్టు ఆమె చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు రాకపోతే  రాహుల్ గాంధీకి భార్యను కావాలని  కోరుకొంటున్నట్టు  ఆమె చెప్పారు. 

సాధ్విప్రాచి వ్యాఖ్యలపై యూపీ కాంగ్రెస్ నేత ఆశోక్ సింగ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ ను అవమానించేవిధంగా సాధ్వి మాట్లాడారని ఆయన విమర్శించారు. ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ  తన ఉనికిని కాపాడుకొనే సాద్వి ప్రాచి ప్రయత్నం చేస్తున్నారని  ఆయన చెప్పారు. సాధ్విగా ఉంటూ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైందికాదన్నారు.

loader