ప్రయాగరాజ్ మహా కుంభమేళా కోసం : అఖాడాలు, సన్యాాసుల కొత్త ట్రెండ్స్

2025 మహాకుంభ్‌లో అఖాడాలలో చాలా మార్పులు చూడవచ్చు. పర్యావరణ పరిరక్షణతో పాటు వెనుకబడిన వర్గాలు, మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని అఖాాడాలు భావిస్తున్నాయి.

Prayagraj Mahakumbh 2025 New Trends in Akharas AKP

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో హిందూ మత విశ్వాసాలనే కాదు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి అఖాడాలు.  అనాదిగా ఈ కుంభమేళాలో పాల్గోనే 13 హిందూ సనాతన ధర్మ అఖాడాలు సాంప్రదాయబద్దమైన షాహీ స్నానం వంటి ధార్మిక సంప్రదాయాన్ని అనుసరిస్తున్నాయి. అయితే ఈ అఖాడాలలో కూడా నెమ్మదిగా మార్పు వస్తోంది...   హిందూ సనాతన ధర్మ ప్రచారంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా చేపట్టారు. యోగి ప్రభుత్వం కుంభమేళా నిర్వహణ దృక్పథం కూడా అఖాడాలలో మార్పుకు కీలక పాత్ర పోషించింది.

అఖాడాల ఎజెండాలో పర్యావరణ పరిరక్షణ 

ప్రయాగరాజ్ మహా కుంభమేళాను గ్రీన్ కుంభమేళగా నిర్వహించాలనేది యోగి సర్కార్ ప్రయత్నం... ఇందుకోసం ఇప్పటికే ప్లాస్టిక్ ను వినియోగించకూడదని పర్యాటకులు, వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది. కుంభమేళా యంత్రాంగం దీనికోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అఖాడాలు, సన్యాసుల మహా కుంభమేళా కార్యసూచిలో కూడా సనాతన ధర్మ ప్రచారంతో పాటు పర్యావరణ పరిరక్షణ చేరింది.

నిరంజని అఖాడ యొక్క ప్రయాగరాజ్ ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 5, 2024న జరిగిన అఖాడా పరిషత్ సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో పర్యావరణ పరిరక్షణ కూడా ఒక అంశం. అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పురి మాట్లాడుతూ... ప్రకృతి ఉంటేనే మానవుడు అని, అందుకే ప్రకృతిని కాపాడుకోవడానికి పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యమన్నారు. ఈసారి మహా కుంభమేళాలో అఖాడాల సన్యాసులు కూడా ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తారన్నారు. అంతేకాకుండా మహాకుంభ్‌లో సన్యాసులు, భక్తులు ప్లాస్టిక్, థర్మోకోల్ పాత్రలకు బదులుగా దోనెలు, మట్టి పాత్రలను వాడాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

Prayagraj Mahakumbh 2025 New Trends in Akharas AKP

దళిత సన్యాసులకు అఖాడాలలో కీలక పదవులు

ఆది శంకరాచార్యులు బౌద్ధిక, సైనిక భావాలతో కూడిన బ్రాహ్మణ, క్షత్రియ కుటుంబాల నుండి యువకులను సమీకరించి దేశ, సంస్కృతి రక్షణ కోసం ఏర్పాటు చేసిన సైన్యం నుండే 13 అఖాడాలు ఉద్భవించాయి.  ధార్మిక సంప్రదాయం ప్రకారం చాలా కాలంగా సనాతన ధర్మ అఖాడాలు తమ ధార్మిక ప్రయాణం చేస్తున్నాయి. యోగి ప్రభుత్వం 2019లో నిర్వహించిన కుంభమేళాలో అఖాడాలలో మార్పు చూడవచ్చు.

సమాజంలో వెనుకబడిన, దళిత వర్గాల నుండి వచ్చిన సాధువులకు కూడా అఖాడాలలో ఉన్నత పదవులు కల్పించారు. ముందుగా దళిత సమాజం నుండి వచ్చిన జూనా అఖాడ సన్యాసి కన్హయ్య ప్రభు నందగిరిని 2019లో జూనా అఖాడ మహామండలేశ్వర్‌గా నియమించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ మహాకుంభమేళాలో 450 మందికి పైగా వెనుకబడిన, దళిత సమాజాలకు చెందిన సన్యాసులకు మహామండలేశ్వర్, మహంత్, మండలేశ్వర్ వంటి బిరుదులు ఇస్తారు.

జూనా అఖాడ పోషకుడు మహంత్ హరిగిరి నేతృత్వంలో ఈ ఏడాది మహాకుంభమేళాలొ జూనా అఖాడలో 370 మంది దళిత మహామండలేశ్వర్లు, మండలేశ్వర్లు, మహంతులు, పీఠాధిపతులను నియమించనున్నారు. శ్రీ పంచాయతీ అఖాడ ఉదాసీన్ నిర్వాణ శ్రీ మహంత్ దుర్గాదాస్ మాట్లాడుతూ...తమ అఖాడలో కూడా ఈ మహాకుంభ్‌లో వెనుకబడిన, దళిత సమాజాలకు చెందిన సాధువులకు ఉన్నత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు.

శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణి కార్యదర్శి మహంత్ జమునా పురి మాట్లాడుతూ... అఖాడాలలో వచ్చిన ఈ మార్పు వెనుక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రేరణ ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన మహాత్ములను కూడా అర్హత మేరకు అఖాడాలలో గౌరవించి, పదవులు కల్పించాలనే ఆయన ఆకాంక్ష అని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వారిని కలుపుకోవాలన్నారు.

అఖాడాల కీలక పదవులలో మహిళలు

అఖాడాలు శివ, శక్తికి ప్రతీక... మాతృశక్తిని ఎల్లప్పుడూ అఖాడాలు పూజనీయంగా భావిస్తాయి. సనాతన ధర్మ పతాకాన్ని ఎగురవేయడంలో కూడా మహిళలు ఎవరికీ తీసిపోరు. ప్రయాగరాజ్‌లో 2019లో జరిగిన కుంభమేళాలొ దేశ, రాష్ట్రంలో మహిళా సాధికారత ప్రభావం కనిపించింది. పెద్ద సంఖ్యలో మహిళా సన్యాసినులకు మహామండలేశ్వర్ పదవినిచ్చి, వారికి పట్టాభిషేకం చేశారు.

నిర్మోహి అని అఖాడ కార్యదర్శి మహంత్ రాజేంద్ర దాస్ మాట్లాడుతూ, గత కుంభమేళాలో ఎనిమిది మంది విదేశీ మహిళలను మహంత్‌లుగా నియమించామని, ఈ మహాకుంభ్‌లో మహిళలకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తామని, నలుదిశలా సనాతన ధర్మ ప్రచారం జరగాలని అన్నారు. వివిధ అఖాడాలు 53 మంది మహిళా సన్యాసినులను ఈసారి మహంత్, మహామండలేశ్వర్లుగా నియమించడానికి సిద్ధమవుతున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios