Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియోలు..!

ఆండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సృష్టించిన వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియోలు హల్ చల్ చేశాయి. ఈ వీడియోలు చూసి విద్యార్థులు సైతం షాకయ్యారు.
 

Porn content leaked into Lucknow University's WhatsApp study group, police complaint filed
Author
Hyderabad, First Published Jul 19, 2021, 12:40 PM IST

విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో.. పోర్న్ వీడియోలు కలకలం రేపాయి. ఈ సంఘటన లక్నోలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

లక్నో విశ్వవిద్యాలయం లోని పురాతన భారతీయ చరిత్ర, పురావస్తు విభాగానికి చెందిన ఆండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు సృష్టించిన వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియోలు హల్ చల్ చేశాయి. ఈ వీడియోలు చూసి విద్యార్థులు సైతం షాకయ్యారు.

ఈ విషయంలో.. యూనివర్శిటీ చీఫ్ ప్రోక్టర్ హసంగంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా.. నిందితుడిని గుర్తించే పనిలో పోలీసులు తెలిపారు. టీచర్స్, స్టూడెంట్స్ ఇంటారక్షన్ కోసం ఓ మహిళా విద్యార్థిని ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఆ గ్రూప్ లో గుర్తుతెలియని వ్యక్తి.. పోర్న్ చిత్రాలు, వీడియోలు, అసభ్యకరమైన సంభాషణలు షేర్ చేయడం గమనార్హం.

దాదాపు 170 మంది విద్యార్థులతో  ఈ గ్రూప్ క్రియేట్ చేశారు. కాగా.. ఈ అసభ్య చిత్రాలు, పోస్టుల కారణంగా కొందరు విద్యార్థులు గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావడం గమనార్హం.

గ్రూప్ లోని నలుగురు అమ్మాయిలను ఉద్దేశించి.. ఓ అబ్బాయి నుంచి ఈ మెసేజ్ లు వచ్చినట్లుగా ఉంది. అర్థరాత్రిపూట ఈ మెసేజ్ లు రావడం గమనార్హం. చాలా అసభ్యకరంగా అమ్మాయిలను టార్గెట్ చేస్తూ మెసేజ్ లు  చేయడం గమనార్హం. ఉపాధ్యాయులు వెంటనే స్పందించడంతో.. మరింత నీచమైన ఫోటోలను షేర్ చేయడం మొదలుపెట్టాడు. ఆ పోస్టులు చేసే వ్యక్తి విద్యార్థి కాదని తెలుస్తోంది. దీంతో.. దీనిపై పోలీసులను ఆశ్రయించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios