కోల్ కతాలో అమానుషమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నటిగా అవకాశం ఇస్తానని చెప్పి ఓ యువతి మీద గ్యాంగ్ రేప్ చేసి ఆ వీడియోను పోర్స్ సైట్లలో పెట్టారు. తాజాగా ఈ ఫోర్న్ వీడియో కేసులో అరెస్టైన ఐదుగురు నిందితుల మీద మహిళల అక్రమరవాణా, సామూహిక అత్యాచారం కేసులు కూడా నమోదయ్యాయి. 

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంకోసం లాంచ్ చేస్తున్న ఓ ప్రాజెక్ట్ల్ లో కీ రోల్ ఇస్తామని ఔత్సాహిక నటికి కొందరు హామీ ఇచ్చారు. దీనికోసం వీడియో షూట్ అని పిలిచారు. ఆ తరువాత ఆమె వీడియోలు పోర్న్ వెబ్ సైట్లలో దర్శనమివ్వడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా.. వారిమీద మోపబడ్డ ఆరోపణలను కోర్టు అంగీకరిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఇది జరిగిన తరువాత బాధితురాలికి థ్రెటెనింగ్ కాల్స్ రావడంతో పోలీసులు కేసును తిరగదోడారు. 

గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిమీద పోలీసులు వేరే కేసు నమోదు చేశారు. అంతేకాదు బాధితురాలి వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమెకు ప్రత్యేక రక్షణ కల్పించారు. 

ఈ కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నియమించబడిన సైబర్ ఎక్స్ పర్ట్  అయిన బివాస్ చటర్జీ మాట్లాడుతూ.. ఇప్పటివరకు బాధితురాలు ఐదుగురు నిందితులను గుర్తు పట్టిందని తెలిపారు. వీడియో షూట్ కు ముందు తనకు మత్తు ఇచ్చారని.. దీంతో తను స్పృహ కోల్పోయానని.. ఆ తరువాత తీవ్రంగా వేధించారని తెలిపింది. స్పృహలోకి వచ్చిన తరువాత శరీరం అంతా నొప్పులుగా ఉందని అయితే తనకు జరిగిన విషయం తెలియలేదని చెప్పుకొచ్చిందట. 

అయితే ఈ వీడియో పోర్న్ సైట్లలో వీడియో వైరల్ కావడంతో తన అపార్ట్ మెంట్లో ఉన్న కొంతమంది యువకులు తనింటికి వచ్చారని, డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో ఈ వీడియోను మొత్తం అపార్ట్ మెంట్ , కాలనీలో వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

 దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న బిద్దనగర్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ యువకులకు ఆ ఐదుగురు నిందితులకు సంబంధాలున్నాయా? ఉంటే ఎలాంటివి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారని చటర్జీ తెలిపారు. 

ఈ కేసులో నిర్మాత సుభంజన్ రాయ్ ని అరెస్ట్ చేసిన తరువాత అసలు వీళ్లు ఎలా ఆపరేట్ చేస్తున్నారన్న విసయం వెలుగులోకి వచ్చింది. మిగతా నలుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చిన గత వారం రోజులుగా ఎంతోమంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలిపారు.