Asianet News TeluguAsianet News Telugu

పుదుచ్చేరీ ఎన్నికలు : 2 కోట్ల నగదు, 30 వేల సెటాప్ బాక్సులు సీజ్ !

మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కదిర్ కామం, తట్టంచావడి, ఇందిరానగర్ నియోజకవర్గాలకు చెందిన అధికారుల తనిఖీల్లో భాగంగా ఓ వాహనాన్ని అడ్డుకున్నారు.

poll officials seize rs 2 crore cash and 30,000 set top boxes in puducherry - bsb
Author
Hyderabad, First Published Mar 19, 2021, 3:35 PM IST

మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కదిర్ కామం, తట్టంచావడి, ఇందిరానగర్ నియోజకవర్గాలకు చెందిన అధికారుల తనిఖీల్లో భాగంగా ఓ వాహనాన్ని అడ్డుకున్నారు.

ఈ వాహనంలో రూ. 2 కోట్ల నగదు తరలిస్తున్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) షుర్బీర్ సింగ్ మాట్లాడుతూ ఈ నగదును బ్యాంకు నుంచి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నప్పటికీ అందుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించలేదన్నారు.

ఓటర్లకు అక్రమంగా పంచేందుకే నగదు తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయన్నారు. దీంతో నగదును సీజ్ చేసి తదుపరి విచారణ కోసం ఐటీ అధికారులకు అప్పగించినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 వాహనంలో స్వాధీనం చేసుకున్న నగదులో అన్ని రూ. 500, రెండు వందల రూపాయలు, వంద రూపాయల నోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు  ఎంబాలం, నెట్టపక్కం, బహూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అధికారులు ఓ ఇంటి నుంచి దాదాపు 30 వేల సెటప్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్నారని సీఈవో వెల్లడించారు.

వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. అలాగే, కరైకల్ లో ఓ దుకాణం నుంచి 3,600 లీటర్లకు పైగా మద్యాన్ని సీజ్ చేశామని, ఇప్పటివరకూ పుదుచ్చేరిలో మొత్తంగా 18500 చేసినట్లు ఆయన వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios