ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ కూతురిపై నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  కాన్పూర్ కి చెందిన ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ కుమార్తె  స్థానిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.

కాగా.. ఆమెకు పరిచయస్థుడైన ఓ బీటెక్ విద్యార్థి.. ఆమెకు మాయమాటలు చెప్పి.. ఓ ఫ్లాట్ కి తీసుకువెళ్లాడు. అక్కడ తన మిత్రులతో కలిసి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులు నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.