అతనికి పెళ్లై కొద్ది నెలలు కూడా గడవడం లేదు. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులకే అతనికి భరించలేని నిజాలు తెలిశాయి. భార్య ఫోన్ కి అశ్లీల, వీడియోలు, ఫోటోలు వస్తుంటే.. ఎవరో బెదిరిస్తున్నారని అనుకున్నాడు.. తీరా ఆరా తీస్తే... ఆమె ప్రేమికుడేనన్న విషయం తెలిసి కంగుతిన్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read డేటింగ్ యాప్ లో పరిచయం.. బలవంతంగా కారులో యువతిపై.....

పూర్తి వివరాల్లోకి వెళితే... హాసన్ జిల్లాకు చెందిన ఓ మహిళ చిక్కమంగళూరు జిల్లాలోని ఓ కోర్టులో టైపిస్ట్ గా పనిచేస్తోంది. ఆమెకు గతేడాది నవంబర్ 24వ తేదీన బెంగళూరుకి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిగింది.  కొద్ది రోజులపాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అయితే... భార్య ఫోన్ కి ఓ వ్యక్తి నుంచి ఆమె నగ్న వీడియోలు రావడం ఆమె భర్త గమనించాడు.

తన భార్య నగ్న వీడియోలు అతనికి ఎలా వచ్చాయా అనే అనుమానంతో వెంటనే అతనికి ఫోన్ చేయగా... ఆమె తన ప్రియురాలని.. గత ఏడు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని చెప్పాడు. అది విని మహిళ భర్త షాకయ్యాడు. ఈ విషయంలో భార్యను నిలదీయగా.. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తాను భర్త వద్దకు రానంటూ మోరాయించి కూర్చుంది.

భార్య ప్రవర్తనతో కంగుతిన్న సదరు వ్యక్తి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. మోసం చేసిన తనకు పెళ్లి చేశారంటూ తన భార్య, ఆమె కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.