Asianet News TeluguAsianet News Telugu

భార్యకు తెలీకుండా ప్రైవేట్ పార్ట్స్ లైవ్ స్ట్రీమింగ్ లో పెట్టి..!

 భర్త మరింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎలాగూ సంతానం లేదుకదా.. పోర్న్ లో నటించాలంటూ ఆమెను వేధించాడు. 

Police case against the man who tortures wife in Mumbai
Author
Hyderabad, First Published Jul 28, 2021, 8:15 AM IST

కట్టుకున్న భార్యను జాగ్రత్తగా చూసుకోవాల్సిన భర్త.. ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించాడు. భార్యను బజారున పెట్టడానికి ప్రయత్నించాడు. భార్యను బలవంతంగా పోర్న్ లో నటించేలా చేసేందుకు యత్నించాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముంబయికి చెందిన ఓ ఫిజియోథెరపిస్ట్ కి 2014లో వివాహమైంది. అతను ఓ స్టార్ హోటల్ యజమాని కుమారుడు. కాగా.. పెళ్లై దాదాపు ఏడేళ్లు అయినా.. వీరికి ఇంత వరకు సంతానం కలగలేదు. దీంతో.. అత్తింటివారు.. సదరు మహిళను ఆమెను వేధించడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలో.. భర్త మరింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎలాగూ సంతానం లేదుకదా.. పోర్న్ లో నటించాలంటూ ఆమెను వేధించాడు. అయితే.. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో.. ఆమెకు తెలియకుండానే.. ఈ ఊబిలోకి దింపాలని ప్లాన్ వేశాడు.

నిద్రపోతున్న భార్య తో తాను సరసాలాడుతూ.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టాడు. సడెన్ గా ఈ విషయాన్ని గుర్తించిన భార్య.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది. దీంతో.. తాను చెప్పినట్లు చేయడం లేదని.. మతాచారం ప్రకారం.. విడాకులు ఇవ్వాలంటూ బలవంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios