విదేశీ వనితలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

బెంగళూరు నగరంలో కొందరు నిర్వాహకులు రహస్యంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. విదేశాల నుంచి యువతులను రప్పించి మరీ.. ఈ దందా నిర్వహించడం గమనార్హం.  కాగా.. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో.. అక్కడ సోదాలు నిర్వహించారు. 

కాగా.. నలుగురు విదేశీ వనితలతో వ్యభిచారం సాగిస్తుండగా తమ సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసు బృందం దాడులు చేసిందని బెంగళూరు పోలీసు జాయింట్ కమిషనర్ చెప్పారు. వ్యభిచారం రాకెట్ నుంచి నలుగురు విదేశీ మహిళలను పోలీసులు కాపాడారు. విదేశీ మహిళలను మహిళా సదనానికి తరలించారు. 

గత కొంత కాలంగా విదేశీ మహిళలతో వ్యభిచారం సాగిస్తున్నారని నిర్వాహకులను అరెస్టు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని బెంగళూరు పోలీసులు చెప్పారు. దీంతోపాటు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ 20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగులకు పాల్పడిన ఓ ముఠాను తాము అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. బెట్టింగ్ నిర్వాహకుల నుంచి రూ.4.5లక్షలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వివరించారు.