Asianet News TeluguAsianet News Telugu

PM Modi: అణు విద్యుత్‌కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని..

Indias First Indigenous Fast Breeder Reactor: తమిళనాడులోని కల్పక్కంలో దేశీయంగా నిర్మించిన 500 మెగావాట్ల ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను ప్రధాని మోడీ సందర్శించారు.  ఈ సందర్బంగా ఈ ప్రాజెక్టులోని  రియాక్టర్ వాల్ట్, కంట్రోల్ రూమ్‌ల్లో పర్యటించి, ప్రాజెక్టు సమాచారాన్ని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు

PM Modi Visits Nuclear Power Plant In Tamil Nadu KRJ
Author
First Published Mar 4, 2024, 11:34 PM IST

Indias First Indigenous Fast Breeder Reactor: విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కీలకమైన తమిళనాడులోని కల్పాక్కంలో దేశీయంగా నిర్మించిన 500 మెగావాట్ల ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌(PFBR)ను ప్రధాని మోడీ సందర్శించారు. ఈ ప్రాజెక్టులోని 'కోర్ లోడింగ్' ప్రారంభం ప్రధానమంత్రి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా  ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 'కోర్ లోడింగ్' ప్రారంభంతో భారతదేశం అణు కార్యక్రమంలో రెండవ దశలోకి ప్రవేశించడానికి ఒక అడుగు దూరంలో ఉందనీ, ఈ చర్యను చారిత్రక మార్పుగా అభివర్ణించారు.

ఈ తరుణంలో కల్పక్కంలో రియాక్టర్ వాల్ట్, కంట్రోల్ రూమ్‌లో సమాచారాన్ని శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.  ఈ 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవినీ) అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టు విజయంతో.. రష్యా తర్వాత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న రెండవ దేశంగా భారత్ అవతరిస్తుంది. ప్రధాని మోడీ వెంట సహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎకె మొహంతి, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ వివేక్ భాసిన్, ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ బి వెంకటరామదాస్ వంటి తదితరులు ఉన్నారు. 

2003లో భారత ప్రభుత్వం ఆమోదం  

ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు అణువిద్యుత్ కేంద్రాల్లో సంప్రదాయ అణు రియాక్టర్లను మాత్రమే వినియోగిస్తున్నారు. వీటికి భిన్నంగా ఉండేవే.. అత్యాధునికమైన రియాక్టర్లను ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు. వీటినే సార్ట్ గా  (ఎఫ్‌బీఆర్)గా పిలుస్తారు. ఇవి సంప్రదాయ రియాక్టర్లకన్నా దాదాపు 70 శాతం అధికంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. అలాగే.. ఇవి చాలా సురక్షితమైనవి. ఎఫ్‌బీఆర్‌ల నుంచి అణువ్యర్థాలు చాలా తక్కువ మోతాదులో విడుదలవుతాయి.కాబట్టి వ్యర్థాల నిర్వహణ సమస్య ఉండదు.

ఇలాంటి అత్యంత అధునాతన అణు రియాక్టర్ - ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) తయారీ, నిర్వహణ కోసం 2003లో భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భవినీ) ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్వావలంబన భారత్ స్ఫూర్తికి అనుగుణంగా, MSMEలతో సహా 200కి పైగా భారతీయ పరిశ్రమల నుండి గణనీయమైన సహకారంతో PFBR పూర్తిగా స్వదేశీంగా భవినీచే రూపొందించబడింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (FBR) ప్రారంభంలో యురేనియం-ప్లుటోనియం మిశ్రమ ఆక్సైడ్ (MOX) ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios